మెరుపు వేగంతో స్పందించిన 3 టౌన్ క్రైమ్ పోలీసులు..!

విశాఖపట్నం,మార్చి:21(స్వతంత్ర ప్రభ)

నగరంలోని 3 టౌన్ క్రైమ్ పోలీసులు తమ విధి నిర్వహణలో అంకితభావాన్ని చాటుకున్నారు. బైక్ పోయిందని ఫిర్యాదు అందిన కేవలం 2 గంటల వ్యవధిలోనే దాన్ని వెతికి పట్టుకుని బాధితురాలికి అప్పగించి శభాష్ అనిపించుకున్నారు.సి.బి.ఎం కాంపౌండ్ నివాసి పి. స్వాతి శనివారం ఉదయం తన హోండా యాక్టివా (AP 40 హెచ్. కె  7111) పై పెద వాల్తేరు రైతు బజారుకు వెళ్లారు. ఉదయం 8:15 గంటలకు ఆమె తిరిగి వచ్చి చూసేసరికి పార్కింగ్ లో పెట్టిన తన వాహనం కనిపించలేదు. కంగారు పడకుండా ఆమె వెంటనే 112 కి ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించారు.దీనిపై స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఆదేశాల మేరకు హెడ్ కానిస్టేబుల్ ఎం. రామకృష్ణ, కానిస్టేబుల్ పి. రామకృష్ణ తక్షణమే రంగంలోకి దిగారు. ఘటనా స్థలానికి చేరుకుని అక్కడ ఉన్న సి.సి. కెమెరా ఫుటేజీని నిశితంగా పరిశీలించి, తమదైన శైలిలో గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో చిన వాల్తేరు ఏరియాలో ఆ వాహనాన్ని గుర్తించి స్టేషన్‌కు తరలించారు. పోగొట్టుకున్న వాహనాన్ని అతి తక్కువ సమయంలోనే ట్రేస్ చేసి ఇచ్చినందుకు బాధితురాలు పి. స్వాతి హర్షం వ్యక్తం చేస్తూ.. పోలీస్ కమిషనర్ శంకబ్రాత బాగ్చికి, క్రైమ్ డి.సి.పి కే. లతా మాధవికి మరియు 3 టౌన్ క్రైమ్ సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *