అరకులోయ లో టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

అల్లూరి జిల్లా అరకులోయ,(స్వతంత్ర ప్రభ)

అరకులోయ లో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు అరకు ఇంఛార్జ్ సియ్యారి దొన్నుదొర పార్టీ జెండా ఆవిష్కరించి, అనంతరం పార్టీ దివంగత నేత ఎన్టీ రామారావు విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గ వ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొందని, పేదవాడి ఆకలి తీర్చడమే ధ్యేయంగా ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారని, నేటికీ అదే స్ఫూర్తితో పార్టీ ముందుకు సాగుతోందని పేర్కొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *