భరోసా ఇచ్చి పేద బతుకులపై కొడతారా?

నైట్ ఫుడ్ కోర్ట్ వ్యాపారులకు న్యాయం జరగాలి

ముద్ర లోన్స్ ఎలా కడతారు?

కూటమి ప్రభుత్వ అరాచకాలపై నిప్పులు చెరిగిన మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి

విశాఖ దక్షిణం,( స్వతంత్ర ప్రభ)

విశాఖ సెంట్రల్ పార్క్ వద్ద ఉన్న నైట్ ఫుడ్ కోర్టు తొలగించి ఆరు మాసాలు గడుస్తున్న ఇప్పటికీ వారికి ఇచ్చిన భరోసాను గాలికి వదిలేయడం దుర్మార్గమని మాజీ ఎమ్మెల్యే దక్షిణ వైఎస్ఆర్సిపి సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ కూటమి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. పండగల ముందు షాపులు తొలగించి చిరు వ్యాపారుల ఉసురును మూటగట్టుకున్నారని మండిపడ్డారు. వారికి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని చేస్తున్న రిలే నిరాహార దీక్షకు వెళ్లి వాసుపల్లి గణేష్ కుమార్ మద్దతు తెలియజేశారు. ఈ సందర్భంగా వాసుపల్లి గణేష్కుమార్ మాట్లాడుతూ ఇప్పటికే ముగ్గురు వ్యాపారులు చనిపోయారని, ఆ పాపం కూటమిదేనని అన్నారు. అసలు చిరు వ్యాపారులపై ఆపరేషన్ ఏమిటని ప్రశ్నించారు. గత వైసిపి ప్రభుత్వం లో పేదలకు పెద్దపీట వేసిందని, జగన్మోహన్ రెడ్డిని చూసి సుపరిపాలన అంటే ఏంటో నేర్చుకోవాలని హితవు పలికారు. 2016 నుండి ఇక్కడ వ్యాపారం చేస్తున్నారని, వారికి ముద్ర లోన్స్ కూడా ఇచ్చారన్నారు. ఇప్పుడు ఏ ఆధారంతో వాళ్లు చెల్లిస్తారని ప్రశ్నించారు. వెండర్ కార్డులు ఇచ్చి, కంటైనర్లు ఇప్పిస్తాం అని చెప్పి మాయ చేశారన్నారు. ఆరు నెలలుగా పస్తువులతో ఉన్నారని, పిల్లల్ని ఏ విధంగా చదివించుకుంటారు, పెరుగుతున్న ధరలతో ఏం తింటారని వాసుపల్లి ధ్వజమెత్తారు. హాకర్ కార్డు ఉన్నవారికి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం హాకర్ జోన్స్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. తక్షణమే నైట్ ఫుడ్ కోర్టు చిరు వ్యాపారులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలన్నారు. లేనిపక్షంలో వైసిపి అండగా నిలిచి పోరాటం ఉదృతం చేస్తామని హెచ్చరించారు. మద్దతు తెలిపిన వారిలో వాసుపల్లి తో పాటు రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీ సెల్ చైర్మన్ జాన్ వెస్లీ, వార్డు అధ్యక్షుడు బాపు ఆనంద్, త్రినాధ్,ధోని, నాగరాజు, సాయి, నాగరాజు, మోహన్, పల్ల శ్రీను, అప్పారావు, శంకర్ రావు, నాయుడు,దీక్షలో అసోసియేషన్ అధ్యక్ష శ్రీకాంత్, భోగ్గు శ్యామ్, సుధా,కార్యదర్శులు సభ్యులు, చిరు వ్యాపారులు తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *