విశాఖ దక్షిణం,(స్వతంత్ర ప్రభ)
అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న 31 వ వార్డు డాబాగార్డెన్ లో నివసిస్తున్న సీనియర్ వైసీపీ కార్యకర్త బాణాలకృష్ణ ఇంటికి వెళ్లి ఆయనను పరామర్శించారు దక్షిణ నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతూ ఉండటం, ఈ కారణంగా కంటి చూపు మందగించడంతో, అతను పరిస్థితిని అవార్డు ప్రెసిడెంట్ బాపు ఆనంద్ వాసుపల్లి గణేష్ కుమార్ దృష్టికి తీసుకురావడం జరిగింది. స్పందించిన గణేష్ కుమార్ సీనియర్ పార్టీ కార్యకర్త బాణాల కృష్ణ ఇంటికి వెళ్లి అతనిని పరామర్శించారు. వైద్య ఖర్చుల నిమిత్తం అతనికి ఐదువేల రూపాయల ఆర్థిక సహాయం చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాణాల కృష్ణ కుటుంబానికి తాను అండగా ఉంటానని తెలిపారు. తక్షణ వైద్య ఖర్చులు నిమిత్తం ఐదువేల రూపాయలను అందించడం జరిగిందని,భవిష్యత్తులో అతనికి తన పూర్తి సహకారం ఉంటుందని తెలిపారు. పార్టీ పటిష్టతకు, బలోపేతానికి కష్టపడి పనిచేసిన పరిస్థితి కార్యకర్తను పార్టీ గౌరవిస్తుందని, పార్టీలో వారికి సముచిత స్థానం కల్పిస్తుందని చెప్పారు. ఈ సందర్భంగా ప్రతి కార్యకర్తకు తాను భరోసా ఇస్తున్నట్లు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో 31వ వార్డు ప్రెసిడెంట్ దొడ్డి బాపు ఆనంద్, జిల్లా స్టూడెంట్ వింగ్ జనరల్ సెక్రటరీ పిలక మోహన్,జిల్లా పబ్లిసిటీ వింగ్ సెక్రెటరీ కాండ్రేగుల నాయుడు, వార్డు జనరల్ సెక్రటరీ ఆంగటి త్రినాధ్, కుమార్, వార్డు వైయస్సార్ టి యు సి జనరల్ సెక్రటరీ పెదిరెడ్ల నాగరాజు, జిల్లా జనరల్ సెక్రటరీ గణగళ్ల రామరాజు,35 వ వార్డు ప్రెసిడెంట్ అలుపన కనకరెడ్డి, 31 వార్డ్ ఎస్సీ సెల్ ప్రెసిడెంట్ శ్రీను, వార్డ్ అనుబంధ సంఘాల నాయకులు మోహన్, శేఖర్, కనుక్కుల్లు, శంకర్రావు,33 వ వార్డు యూత్ ప్రెసిడెంట్ బూరెల చిన్న తదితరులు పాల్గొన్నారు.