విశాఖ తూర్పు,(స్వతంత్ర ప్రభ)
మాజీ మంత్రి అంబటి రాంబాబు, మాజీ మంత్రి వెస్ట్ గోదావరి రీజనల్ కోఆర్డినేటర్ గుడివాడ అమర్నాథ్, మాజీ శాసనసభ్యులు మళ్ళా విజయప్రసాద్, వాసుపల్లి గణేష్ కుమార్, అన్నంరెడ్డి అదీప్ రాజు, చింతలపూడి వెంకటరామయ్య, మాజీ మేయర్ గోలగాని హరి వెంకటకుమారి శ్రీనివాస్,,ఈస్ట్ ఇంచార్జ్ మొల్లి అప్పారావు, గాజువాక ఇంచార్జి తిప్పల దేవనరెడ్డి, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర విద్యార్ధి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ ద్రోణంరాజు శ్రీవత్సవ ఇంటికి విచ్చేసి అల్పాహారంలో పాల్గొన్నారు.అనంతరం రాంబాబు మాట్లాడుతూ ద్రోణంరాజు సత్యనారాయణ తో అలాగే ద్రోణంరాజు శ్రీనివాసరావు తో ఉన్న అనుబంధాన్ని వివరించారు,అలాగే శ్రీవత్సవ కూడా ఎల్లవేళల ప్రజలకు,కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ వాళ్ళ తాతగారు, నాన్నగారి వారసత్వాన్ని ముందుకు తిసుకెళ్తున్నారని .. రాబోయే రోజుల్లో మరెన్నో ఉన్నతపదవులు చేపట్టలని ఆకాంక్షించారు… ఈ సందర్భంగా శ్రీవత్సవ మాట్లాడుతూ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్స్, జిల్లా అధ్యక్షులు,నియోజకవర్గం ఇంచార్జీలు అందరూ కూడా ఎల్లవేళల ఒక కుటుంబంలాగా ఆదరిస్తూ ప్రోత్సహిస్తున్నారని అలాగే అందరితో కలిసి పార్టీ బలోపేతానికి కృషిచేస్తానని 2029 లో మళ్ళీ జగన్ గారిని సీఎంగా గెలిపించుకుంటామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ జిల్లా అనుబంధసంఘాల అధ్యక్షులు, రాష్ట్ర కమిటీ సభ్యులు, విశాఖ దక్షిణ నియోజకవర్గ మాజీ కార్పొరేటర్లు, వార్డు అధ్యక్షులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, ద్రోణంరాజు అభిమానులు పేద ఎత్తున పాల్గొన్నారు.