శ్రీ సుబ్రహ్మణ్యస్వామి మాలధారణ భక్తులకు  వాసుపల్లి విరాళం

విశాఖ దక్షిణం,(స్వతంత్ర ప్రభ)

నగరంలోని దక్షిణ నియోజకవర్గం 30వ వార్డు కోడిపందాల వీధిలో ఉన్న శ్రీసుబ్రమణ్య స్వామివారి చైత్ర పౌర్ణమి మహోత్సవాల్లో మాల ధరించిన భక్తులకు మాజీ ఎమ్మెల్యే దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త 10వేల రూపాయలు విరాళం అందజేశారు. ఆసీలమెట్ట కార్యాలయంలో బుధవారం  వార్డు ప్రెసిడెంట్ దశమంతల మాణిక్యాలరావు తో కలిసి వారంతా వాసుపల్లి గణేష్ కుమార్ ని మర్యాదపూర్వకంగా కలిశారు. స్వామి వారి వేడుకలకు మాల దీక్షలు విరమణకు సంబంధించి సాయం అందజేశారు. మార్చి నెలలో చైత్ర పౌర్ణమి వేడుకలు పురస్కరించుకొని శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని స్థానికులు ఎంతో భక్తి శ్రద్ధలతో మాల ధరించి ఆరాధిస్తారన్నారు. వారికి తన వంతు సాయంగా సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తానని వాసుపల్లి తెలిపారు. యూత్ ప్రెసిడెంట్ బంగారు బాబ్జి మాట్లాడుతూ దీక్షల ముగించుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహిస్తామని, తమకు సహాయ సహకారాలు అందించిన వాసుపల్లి గణేష్ కుమార్ కి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్టేట్  ఆర్టీఐసెక్రటరీ దస్మాంతుల చిన్ని, సౌత్ లీగల్ సెల్ ప్రెసిడెంట్ చింతపల్లి లీల కృష్ణ,వార్డ్ బి.సి సెల్ ప్రెసిడెంట్ వేణు,ఆలయ అర్చకులు రాఖి, వార్డ్ ఎస్సీ సెల్ ప్రెసిడెంట్ దశమంతల సంతోషి,మాడుగుల నారాయణా మూర్తి,మణికంఠ, కృష్ణ,ఆదిత్య, ప్రవీణ్, ఉత్తరాంధ్ర ఎస్సీ సెల్ ప్రెసిడెంట్ చెన్నా జానకిరామ్, జిల్లా జనరల్ సెక్రెటరీ గణగాళ్ల రామరాజు, వార్డ్  నాయకులు,కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *