ఆర్థిక సహాయం అందించిన కేతావత్ కమల మధు, మాధవి సందీప్,వందన సంతోష్
మహబూబ్ నగర్ జిల్లా (స్వతంత్ర ప్రభ)
మహబూబ్‌నగర్ సమీపంలో ఉన్న శ్రీ లోకమసంద్ మహారాజ్ దేవాలయం పక్కన ఉన్న లచ్చమ మసంద్ దేవాలయం పురాతన ఆలయం. ఈ దేవాలయం కాలక్రమేణా పాతబడిన పరిస్థితిలో ఉందని గమనించబడింది పెద్దమునిగల్ గ్రామానికి చెందిన కేతావత్ కమల మధు (రిటైర్డ్ జె.డబ్ల్యూ.ఎం)డిఫెన్స్) మరియు కుమారులు కోడళ్ళు, కేతావత్ మాధవి సందీప్, కేతావత్ వందన సంతోష్,ఈ ఆలయ అభివృద్ధికి ముందుకొచ్చి, దేవాలయంలో టైల్స్ మరియు గ్రానైట్‌లను ఏర్పాటు చేయించి, నీటి పైపులైన్‌ను కూడా ఏర్పాటు చేయించారు. కేతావత్ కమల మధు దంపతులు కేతావత్ మాధవి సందీప్, వందన సంతోష్,దంపతులు ఆలయ పునరుద్ధరణకు సహాయం అందించారు.