విశాఖ దక్షిణం,(స్వతంత్ర ప్రభ)

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మమైన పేదల సేవలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ పథకం లో భాగంగా బుధవారం విశాఖ దక్షిణ నియోజకవర్గం 39వ వార్డులోని ఐదు సచివాలయ పరిధిలోని వివిధ ప్రాంతాలలో పింఛన్ లబ్ధిదారులకు ఇంటింటికి వెళ్లి పెన్షన్లు పంపిణీ చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో సంబంధిత స్వర్ణ గ్రామం స్వర్ణ వార్డు సచివాలయ సిబ్బందితో పాటుగా తెలుగుదేశం పార్టీ వార్డు అధ్యక్షులు మైలిపిల్లి శ్రీను, క్లస్టర్ ఇంచార్జ్ వాసుపల్లి దానయ్య, వార్డ్ బూతు కన్వీనర్లు తిత్తి సాయి బలరాం , షేక్ రేహంతుల్లా, ఇల్లా శ్రీను, నీలి అరుణ, ఆలేటి వెంకట్రావు, గంగిరి శ్రీను, పార్లమెంట్ ఉపాధ్యక్షులు అబ్దుల్ అనీఫ్, తెలుగుదేశం పార్టీ నాయకులు యూసఫ్, సతీష్, నర్సింగ్ తదితరు లు పాల్గొన్నారు