విశాఖ దక్షిణం (స్వతంత్ర ప్రభ)
ప్రజా సేవే పరమావధిగా నిరంతరం సేవలందించే మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ మరోసారి తన దాతృత్వం చాటుకున్నారు.దక్షిణ నియోజకవర్గం 34వ వార్డు కొబ్బరి తోటకు చెందిన చింతల సత్య కొద్దికాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న విషయం వార్డు నాయకుల ద్వారా తెలుసుకొని ఇంటికి వెళ్లి ఓదార్పునిచ్చారు. 34వ వార్డు కార్పొరేటర్ తోట పద్మావతి, రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీ సెల్ చైర్మన్ జాన్ వెస్లీ తో కలిసి క్యాన్సర్ పేషెంట్ ను పరామర్శించి సొంత నిధులతో రూ.5వేలు నగదు తో పాటు ఒక బియ్యం బస్తాను అందజేశారు. ఈ సందర్భంగా వాసుపల్లి గణేష్ కుమార్ కి ఆమె కృతజ్ఞతలు తెలిపారు&*. దక్షిణ నియోజకవర్గంలో పేద ప్రజలను ఆదుకునే ఒకే ఒక్క నాయకుడు వాసుపల్లి గణేష్ కుమార్ అని కొనియాడారు. నిస్వార్థ సేవలు అందిస్తూ నిత్యం పేదలకు ఆర్థిక సహాయంతో పాటు విద్యాదానం చేస్తున్న వాసుపల్లి గణేష్ కుమార్ సేవలు ప్రశంసనీయమని వార్డు నాయకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి నాయకత్వంలో తాము పని చేయడం అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో 34వ వార్డు వాటి ప్రెసిడెంట్ మరియు మాజీ కార్పొరేటర్ తోట పద్మావతి, స్టేట్ నాయకులు లింగం శ్రీనివాస్,లండ రమణ,జిల్లా నాయాకులు వాసుపల్లి ధనరాజు ,సి.హెచ్.జ్యోతి , దూడ అప్పారావు ,గల్లీ పార్వతి ,అంబతి అప్పలరాజు ,కారి దానియమ్మ , పోటీలా అప్పారావు , సి.హెచ్. సతీరాజు ,కె.నాగమణి ,ఎస్.లక్ష్మణ్ రావు వార్డ్ నాయకులు తదితరులు పాల్గొన్నారు