అలయన్స్ క్లబ్ మరియు మామిడి వీరభద్రరావు ఉదారత
విశాఖ దక్షిణం (స్వతంత్ర ప్రభ)
నడవలేని స్థితిలో ఉండి ఇబ్బంది పడుతున్న ఒక నిరుపేద మహిళకు అలయన్స్ క్లబ్ మరియు ప్రముఖ సంఘసేవకులు మామిడి వీరభద్రరావు అండగా నిలిచారు. అలయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో, వీరభద్రరావు సహకారంతో 34వ వార్డులో సదరు మహిళకు ఉచితంగా వీల్ ఛైర్‌ను అందజేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్, రాష్ట్ర క్రిష్టియన్ మైనార్టీ అధ్యక్షులు జాన్ వెస్లీ, మరియు 34వ వార్డు మాజీ కార్పొరేటర్ తోట పద్మావతి చేతుల మీదుగా ఈ పంపిణీ జరిగింది.ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ, నిస్సహాయ స్థితిలో ఉన్నవారికి అవసరమైన పరికరాలను అందించి తోడ్పాటునందించడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అలయన్స్ క్లబ్ కుటుంబ సభ్యులతో పాటు, దక్షిణ నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని మహిళకు ధైర్యాన్ని ఇచ్చారు. తమ కష్టాన్ని గుర్తించి సాయం చేసిన నిర్వాహకులకు బాధితురాలు కృతజ్ఞతలు తెలిపారు.