
విశాఖ దక్షిణం,(స్వతంత్ర ప్రభ)
శ్రీవేంకటేశ్వర స్వామి వారి ఏడు వారాల పూజ విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా, దైవకృపతో కోట సతీష్ కుమార్ శర్మ, నాగలక్ష్మి దేవి, సత్యలక్ష్మి అనన్య మరియు అక్షయ కుటుంబ సభ్యులు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీలోని నిరాశ్రయులకు, వృద్ధులకు అన్నప్రసాద వితరణ చేశారు. ప్రముఖ సమాజ సేవకుడు, రెడ్ క్రాస్ సొసైటీ లైఫ్ మెంబర్ పంపాన ఆనంద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో, షెల్టర్ హోమ్‌లో ఉన్న నిరుపేదలకు అత్యంత భక్తితో అన్నసమర్పణ గావించారు. ఈ సేవా కార్యక్రమంలో పంపాన ఆనంద్ తో పాటు మిత్రులు పోలరాజు, నాయుడు, రాజు మరియు షెల్టర్ నిర్వాహకులు మురళి పాల్గొని దాతల ఉదారతను కొనియాడారు. పరమేశ్వరుని అనుగ్రహంతో జరిగిన ఈ అన్నదాన కార్యక్రమం పట్ల షెల్టర్ నిర్వాహకులు మరియు లబ్ధిదారులు సతీష్ కుమార్ శర్మ కుటుంబానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.