న్యూస్ డెస్క్,(స్వతంత్ర ప్రభ)
తాడేపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డినికలిసి పలు అంశాలను చర్చించిన.. పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి.ఈసందర్బంగా నెల్లూరు నగర నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రజలకు చేరువ చేసే విధంగా చంద్రశేఖర్ రెడ్డి సాగిస్తున్న కార్యక్రమాలను జగన్మోహన్ రెడ్డి అభినందించారు. అనంతరం వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్సీచంద్రశేఖర్ రెడ్డికి పలు సూచనలు చేశారు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన సూచనలు సలహాలతో.. పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు.