కాలువల్లో చెత్త వేస్తే కఠిన చర్యలు

జోనల్ కమిషనర్ ఎం.మల్లయ్య నాయుడు

విశాఖ దక్షిణం,(స్వతంత్ర ప్రభ)

నగర సౌందర్యం, పారిశుధ్య నిర్వహణే లక్ష్యంగా దక్షిణ జోనల్ కమిషనర్ ఎం.మల్లయ్య నాయుడు 36వ వార్డు పరిధిలోని చెంగల్రావుపేట, సున్నపు వీధి, పంజా జంక్షన్, టౌన్ కొత్త రోడ్ మరియు ఆసిపాప వీధి ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా క్షేత్రస్థాయిలో పరిస్థితులను గమనించిన ఆయన, కాలువల్లో చెత్త వేస్తున్న ఘటనలపై అధికారుల పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ వెంటనే నివారణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రజల్లో పరిశుభ్రతపై అవగాహన కల్పించడంతో పాటు, చెత్తను కాలువల్లో వేయకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.అలాగే, నిబంధనలకు విరుద్ధంగా రోడ్లపై నిర్మాణ సామాగ్రిని నిల్వ చేస్తున్న భవన యజమానులపై చర్యలు తీసుకోవాలని ప్లానింగ్ విభాగ అధికారులను ఆదేశించారు. వాణిజ్య వర్గాలను ఉద్దేశించి మాట్లాడుతూ.. కిరాణా, పాన్ మరియు ఇతర కమర్షియల్ షాపుల ముందు తప్పనిసరిగా డస్ట్‌బిన్‌లు ఏర్పాటు చేయాలని, రోడ్లపై చెత్త పడకుండా చూడాల్సిన బాధ్యత సానిటరీ ఇన్స్పెక్టర్లదేనని స్పష్టం చేశారు. ఈ పర్యటనలో అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ పద్మావతి, సానిటరీ ఇన్స్పెక్టర్లు అప్పలరాజు, గీతతో పాటు అడ్మిన్, ప్లానింగ్, శానిటేషన్ సెక్రటరీలు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *