చింతూరు .సి. ఐ. గోపాలకృష్ణ
చింతూరు(స్వతంత్ర ప్రభ)
హెల్మెట్ ధరించి తమ ప్రాణాలు కాపాడుకోవాలని ద్విచక్ర వాహనదారులకు, ఇతరులకు చింతూరు సి ఐ గోపాలకృష్ణ అవగాహన కల్పించారు. ఏదైనా ప్రమాదాలు జరిగితే సాధ్యమైనంత ఎక్కువ శాతం హెల్మెట్ ప్రాణాలు కాపాడుతుందని పేర్కొన్నారు.ఈ మేరకు శనివారం రాత్రి స్థానిక పోలీస్ స్టేషన్ ముందు ద్విచక్ర వాహనదారులకు అవగాహన కల్పించారు. హెల్మెట్ లేనిదే డ్రైవింగ్ చేయరాదని అలా చేయటం నేరమని పేర్కొన్నారు. హెల్మెట్ ధరిస్తే 90 శాతం మరణాలు సంభవించకుండా ఉంటాయని పేర్కొన్నారు. ప్రతాధికారుల ఆదేశాల మేరకు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నామని సీఐ గోపాలకృష్ణ పేర్కొన్నారు. ఈ మేరకు డ్రైవింగ్ లైసెన్స్ లేని వారికి, హెల్మెట్ లేని వారికి సుమారు 20 మందికి కేసులు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. వాహనదారులలో తేవడానికి తాము ఈ డ్రైవ్ చేపట్టినట్లు తెలిపారు. డ్రైవింగ్ లైసెన్స్ లేని వారు తమ వద్దకు వస్తే డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పించడానికి సహాయపడతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిఐ గోపాలకృష్ణ తోపాటు, ఎస్సై సంతోష్ కుమార్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.