ఖర్గే వ్యాఖ్యలపై పోలీసులకు బిజెపి యువమోర్చా ఫిర్యాదు..!

కాకినాడ,(స్వతంత్ర ప్రభ)

బిజెపి యువమోర్చ రాష్ట్ర అధ్యక్షులు సునీల్ రెడ్డి ఆదేశాల మేరకు బీజేపీ జిల్లా అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు సూచనలతో కాకినాడ జిల్లా యువమోర్చ అధ్యక్షుడు మునగాల సాయి గోపి మరియు ,ఒలేటి రాము,వనమాడి దుర్గాప్రసాద్, ఏనుగుల లచ్చబాబు,వాసు,కర్రీ శివకుమార్,రాజు, తదితరులు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అయిన మల్లికార్జున ఖర్గే అస్సాం ఎన్నికల ప్రచారంలో భాగంగా ముస్లిం సామాజిక వర్గాలని రెచ్చగొట్టే విధంగా బీజేపీ అర్.ఎస్.ఎస్ మీద చేసిన విద్వేష పూర్వక వ్యాఖ్యలని ఖండిస్తూ కాకినాడ జిల్లా ఏ.ఎస్.పి కి మల్లికార్జున్ ఖర్గే మీద ఫిర్యాదు ఇవ్వడం జరిగింది.ఈ సందర్భంగా కాకినాడ జిల్లా యువ మోర్చా అధ్యక్షుడు మునగాల సాయి గోపి మాట్లాడుతూ దేశ సమైక్యత జాతీయవాద భావాలను మాత్రమే నేర్పే ఆర్ఎస్ఎస్ మీద నిందలు వేయటం అనేది చాలా బాధాకరమైన విషయం.ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు పోలీసులు ఆర్మీతో పాటుగా ఆర్ఎస్ఎస్ యువకులు కొన్ని వందల సందర్భాలలో వారికి సహాయ సహకారాలు అందించారు. అలాంటి ఆర్ఎస్ఎస్ ని బిజెపిని బతకనివ్వకండి తొక్కేయండి అని ముస్లింలను రెచ్చగొట్టే విధంగా కాంగ్రెస్ అధ్యక్షులు చేసిన తీవ్రమైన వ్యాఖ్యలను ఖండిస్తున్నాం వారి మీద చట్టప్రకారం చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసు వారిని కోరుతున్నామని తెలిపారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *