రాష్ట్ర టిడిపి అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు
గీతం మెడికల్ కాలేజీ సహకారంతో ఉచిత మెడికల్ క్యాంప్
విశాఖ తూర్పు,( స్వతంత్ర ప్రభ)

ప్రజలు ఆరోగ్యంగా ఉండాలంటే స్వచ్ఛంద సేవా సంస్థలు ముందుకు రావాలని అటువంటి వారికి మా ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తాదని గాజువాక ఎమ్మెల్యే. రాష్ట్ర టిడిపి అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు అన్నారు.. విశాఖపట్నం పార్లమెంట్ సభ్యులు భరత్ గీతం మెడికల్ కాలేజీ సహకారంతో. వైజాగ్ ఆఫ్టింగ్ అండ్ పర్మినెంట్ డ్రైవర్స్ అసోసియేషన్ గాజువాక హై స్కూల్ లో నిర్వహించిన ఉచిత వైద్య మెగా శిబిరాన్ని ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు. అనంతరం మెగా వైద్య శిబిరాన్ని సందర్శించి రోగులకు గీతం కాలేజీ ఉచితంగా అందించిన మందులను ఎమ్మెల్యే రోగులకు అందజేశారు.. డ్రైవర్స్ ను అభినందిస్తూ ఇటువంటి ఉచిత వైద్య శిబిరాలని వారి పెట్టాలని ప్రజలకు సేవలు చేయాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా విశాఖపట్నం ఎంపీ భరత్ గారికి మెడికల్ క్యాంపు కి సహకారం అందించినందుకు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు… ఈ వైద్య శిబిరంలో పాల్గొన్న గీతం కాలేజీ. వైద్యులకు మెడికల్ సిబ్బందికి ఆయన అభినందనలు తెలిపారు..ఈ కార్యక్రమానికి మరో విశిష్ట అతిథి గాజువాక 67వ వార్డు కార్పొరేటర్ పల్లా శ్రీనివాసరావు పాల్గొని ఆప్టింగ్ డ్రైవర్స్ ప్రజలకు చేస్తున్న సేవలు అభినందనీయమని వారికి ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా. తమ వంతు సహాయం అందిస్తామన్నారు.ఈ కార్యక్రమానికి విచ్చేసిన టిడిపి రాష్ట్ర అధ్యక్షుల పల్లా శ్రీనివాసరావుకి జీవీఎంసీ 67వ వార్డు కార్పొరేటర్ పల్లా శ్రీనివాసరావ్ కి వైజాగ్ ఆఫ్టింగ్ డ్రైవర్స్ అసోసియేషన్ అధ్యక్షులు జానీ ఆధ్వర్యంలో యూనియన్ సభ్యులు వారికి సాలువాలు తో పూలమాలలతో సత్కరించారు.ఈ ఉచిత వైద్య శిబిరంలో సుమారు 250 మంది కి పైగా ఉచిత వైద్య సేవలు అందుకున్నారు.ఈ కార్యక్రమంలో గాజువాక టిడిపి నాయకులు కార్యకర్తలు స్థానిక ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

