రాపూరు,(స్వతంత్ర ప్రభ)
నెల్లూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం పెంచలకోన దేవస్థానం ఇంచార్జి ఈఓ గా కోవూరు జనార్దన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు.ఇక్కడ ఈఓ గా పని చేస్తున్న పోరెడ్డి శ్రీనివాసులు రెడ్డి సెలవు పెట్టి వెళ్లడంతో జిల్లా దేవాదాయ శాఖ ఏసీ కోవూరు జనార్దన్ రెడ్డి ని ఇంచార్జి ఈఓ గా నియమించారు. దింతో ఆయన పెంచలకోన కు చేరుకొని లక్ష్మీ నరసింహస్వామి, ఆదిలక్ష్మి అమ్మవారు,ఆంజనేయ స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆయన ఇంచార్జి ఈఓ గా బాధ్యతలు స్వీకరించారు.