ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్
తాడేపల్లిగూడెం, (స్వతంత్ర ప్రభ)
సమాజ సేవతోనే ఉన్నత స్థితి లభిస్తుందని, ప్రతీ ఒక్కరూ సేవా మార్గంలో నడవాలని శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీ నివాస్ అన్నారు.మండలం లోని పెద తాడేపల్లి రిలయన్స్ పెట్రోల్ బంకు సమీపంలో కీర్తిశేషులు ఈతకోట సత్యనారాయణ, అప్పాయమ్మ దంపతుల సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన చలివేంద్రాన్ని ఎమ్మెల్యే సోమవారం ప్రారంభిం చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తాతాజీ కుటుంబం అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుందని, అందులో భాగంగా ఈరోజు తాతాజీ తల్లిదండ్రుల జ్ఞాపకార్థం శ్రీనివాస గోడౌన్స వద్ద చలివేంద్రం ప్రారంభించడం అభినందనీయమన్నారు. వేసవిలో ప్రజల దాహం తీర్చే విధంగా చలివేంద్రాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంద న్నారు. సేవా కార్యక్రమాలు నిర్వహించాలంటే దైవానుగ్రహం ఉండాలని, తాతాజీని ఆదర్శంగా తీసుకొని సేవా కార్యక్రమాలు నిర్వహిం చాలని కోరారు. కార్యక్రమంలో బిజెపి నియోజక వర్గ ఇన్చార్జి ఈతకోట తాతాజీ, నరసాపురం పార్లమెంటు మీడియా ఇన్చార్జి నరిసే సోమేశ్వర రావు, టైలర్స్ కార్పొరేషన్ చైర్మన్ ఆకాశపు స్వామి, వర్తనపల్లి కాశి, చాపల రమేష్, పుల్ల బాబి, మద్దాల మణికుమార్, పై బోయిన వెంకటరమణయ్య, బైన పాలపు ముఖేష్, మట్ట రామకృష్ణ, సూరపనేని శ్రీనివాస్, గట్టం నాని, అడబాల మురళి పాల్గొన్నారు.