వైబ్రెంట్ జూనియర్ కళాశాల ప్రభంజనం

నంహన్మకొండ, (స్వతంత్ర ప్రభ)

2026 ఇంటర్మీడియట్ ఫలితాల్లో వైబ్రెంట్ జూనియర్ కళాశాల విద్యార్థులు విశేష ప్రతిభ కనబరిచి సంచలనం సృష్టించినట్లు కళాశాల చైర్మన్ సిరంగి శ్రీనివాస్, డైరెక్టర్ సి. హెచ్. రాజేందర్ రెడ్డి, సంయుక్తంగా వెల్లడించారు. ఈ సందర్భంగా సి.హెచ్. రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ, రాజస్థాన్ రాష్ట్రంలోని కోటా తరహాలో గ్రామీణ పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతో వరంగల్‌లో వైబ్రెంట్ విద్యా సంస్థను స్థాపించినట్లు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన ఈ ఫలితాల్లో మొదటి బ్యాచ్ నుంచే అత్యధిక ప్రథమ స్థానాలు సాధించడం ఆనందకరమని పేర్కొన్నారు.ప్రారంభం నుంచి ప్రవేశ పరీక్షలు మరియు ఇంటర్మీడియట్ పరీక్షలకు సమర్థవంతమైన శిక్షణ అందిస్తూ విద్యార్థులను ఉన్నత స్థాయికి తీసుకెళ్తున్నట్లు తెలిపారు. క్రమబద్ధమైన విద్యా ప్రణాళిక, సరైన విధానాలతో గ్రామీణ ప్రాంతాల విద్యార్థులను ప్రతిభావంతులుగా తీర్చిదిద్దిన ఫలితంగా రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ ఫలితాలు సాధించినట్లు వివరించారు.మొదటి సంవత్సరం ఎంపీసీ విభాగంలో అలపురం రిషికేత్, మలోతు వేమ్ల, కంచర్ల పౌర్ణమి తలా 468 మార్కులు సాధించగా, బైపీసీ విభాగంలో గుగులోతు అరుంధతి, బనోతు అక్షయ తలా 437 మార్కులు, పెరుక యోగిత 436 మార్కులు సాధించారు. అదేవిధంగా మరో 48 మంది విద్యార్థులు 460కు పైగా మార్కులు సాధించగా, బైపీసీ విభాగంలో 17 మంది విద్యార్థులు 430కు పైగా మార్కులు సాధించారు.రెండవ సంవత్సరం ఎంపీసీ విభాగంలో కండికొండ రంజిత్ కుమార్ 993, పోసల శ్రీ మహార్త 992, ముసుకు సోనుప్రియ, గోన్ జాహ్నవి తలా 991 మార్కులు సాధించగా, బైపీసీ విభాగంలో అక్షర హర్ష 982, కునుసోతు సాయి 981 మార్కులు సాధించారు. అలాగే రెండవ సంవత్సరంలో మరో 14 మంది విద్యార్థులు 985కు పైగా మార్కులు సాధించి ప్రతిభ చాటారు.అనుభవజ్ఞులైన ఉపాధ్యాయుల పర్యవేక్షణ, ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ధ, నిరంతర మార్గదర్శకత్వం, యోగా మరియు ప్రోత్సాహం వలన ఈ ఫలితాలు సాధ్యమయ్యాయని నిర్వాహకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రధానాచార్యులు టి. శేషకుమార్, నిర్వాహక అధిపతి జి. రఘుపతి, సమన్వయకర్త రామ్ గుమ్మి, బోధనా సిబ్బంది మరియు ఇతరులు పాల్గొన్నారు..

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *