25వ వార్డులో సామాజిక ఐక్యతకు నిదర్శనంగా నిలిచిన వేడుకలు

విశాఖ ఉత్తరం, (స్వతంత్ర ప్రభ)
భారత రాజ్యాంగ నిర్మాత డా. బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా విశాఖపట్నంలోని 25వ వార్డులో పార్టీ రాజకీయాలకు అతీతంగా ఘనంగా వేడుకలు నిర్వహించారు. గాంధీ హరిజన సేవా సంఘం ఆధ్వర్యంలో హరిజనవీధిలో నిర్వహించిన ఈ కార్యక్రమం సామాజిక ఐక్యతకు ప్రతీకగా నిలిచింది. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం, ఆయన ఆశయాలు—సామాజిక న్యాయం, సమానత్వం, విద్యా ప్రాముఖ్యత—పై నాయకులు, స్థానికులు మాట్లాడారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా 25వ వార్డు వైస్సార్సీపీ అధ్యక్షులు, మాజీ కార్పొరేటర్ మువ్వల పొలారావు, టీడీపీ క్లస్టర్ ఇంచార్జి నమ్మి రవికుమార్, వైస్సార్సీపీ అధికార ప్రతినిధి భోగవిల్లి గోవింద్, జనసేన అధ్యక్షుడు ప్రకాష్ తదితరులు హాజరయ్యారు.అదేవిధంగా, యశోద కృష్ణ సేవా సంఘం ప్రతినిధులు, యువజన నాయకులు, ఎస్సీ సెల్ సభ్యులు, వార్డు కమిటీ సభ్యులు, అంగన్వాడీ సిబ్బంది, మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు.ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ..“అంబేద్కర్ చూపిన మార్గం కేవలం ఒక వర్గానికే కాదు, సమాజం మొత్తానికి దారి చూపే దీపస్తంభం. ఆయన కలలు కన్న సమానత్వ సమాజం సాధించాలంటే రాజకీయాలు పక్కన పెట్టి సేవాభావంతో ముందుకు రావాలి” అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో యశోద కృష్ణ సేవా సంఘం జనరల్ సెక్రటరీ బీసపు శ్రీను,నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షులు మువ్వల సంతోష్, వైఎస్సార్ టీయూసీ అధ్యక్షులు సారిపల్లి సంతోష్, పల్లి అప్పారావు, వైస్సార్సీపీ 25వ వార్డు ఎస్సీ సెల్ అధ్యక్షులు జోరీగల గణేష్, వార్డు ఉపాధ్యక్షులు మొండూరి అప్పలరాజు, జిల్లా ఎస్సీ సెల్ ఎగ్జిక్యూటివ్ మెంబెర్ కొమ్ము నాగు, వార్డు జనరల్ సెక్రటరీ బోర గోవింద్, వార్డు సెక్రటరీ పిల్లి పవన్, జామి రాజు, బోరపూడి శ్రీనివాస్, జామి సిద్దు, మున్సిపల్ విభాగం అధ్యక్షులు దిమిలి శ్రీను, బుద్ధ నూకరాజు, యువజన విభాగం అధ్యక్షులు ముద్దాడ అశోక్ , సోషల్ మీడియా అధ్యక్షులు బొట్టా వాసు, నమ్మి మహేష్, అన్నమయ్య రాజు, ఆర్టీఐ వింగ్ అధ్యక్షులు సత్యవరప్రసాద్, వట్టూరి శివ,హరిజన సేవా సంఘం కమిటీ సభ్యులు ఓదురు అఖిల్,ఓదురు బబ్లు, సీహెచ్ మోహన్, మారేష్, కొమ్ము రమణ, స్థానిక అంగన్వాడీ టీచర్ ఈశ్వరిబాయ్, మరియు యువకులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని నివాళులు అర్పించారు.