అంబేద్కర్ ఆలోచనలు, ఆశయాల సాధనే లక్ష్యం

ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, టీడీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షులు

నెల్లూరు,(స్వతంత్ర ప్రభ)

భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్  జయంతి సందర్భంగా నెల్లూరు నగరంలోని స్థానిక విఆర్సి సెంటర్ వద్ద, ఆ మహనీయుని విగ్రహానికి సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తో కలిసి శాసనమండలి సభ్యులు, నెల్లూరు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు బీద రవిచంద్ర పూలమాలతో నివాళులర్పించారు. అనంతరం నెల్లూరు టీడీపీకార్యాలయంలో నిర్వహించిన అంబేద్కర్ జయంతి వేడుకలు కార్యాలయంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ చిత్రపటానికి నివాళులు అర్పించారు.అనంతరం బీద మాట్లాడుతూ…భారతదేశ నిర్మాణంతోపాటు, పీడిత, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి, హక్కుల సాధన కోసం జీవితకాలం శ్రమించిన గొప్ప వ్యక్తి డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ నేటి సమాజంలో బలహీనవర్గాలకు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా గౌరవం దక్కడానికి, విద్య-ఉద్యోగ అవకాశాలు అందడానికి కారణమైన వారు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్.అంటరానితనం, కుల వివక్షత కు వ్యతిరేకంగా సమాజంలోని అసమానతలను నిర్మూలించేందుకు అవిశ్రాంతంగా శ్రమించిన సామాజికవేత్త డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్.స్వాతంత్రం వచ్చి దాదాపు 80 సంవత్సరాలు గడుస్తున్నా సమాజంలో అసమానతలు, సామాజిక రుగ్మతలు ఇంకా కొనసాగుతున్నాయి, వాటి రూపుమాపేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి.ఏ వృత్తిలో ఉన్నా, ఏ రంగంలో పనిచేస్తున్నా, రాజకీయంగా ఏ పదవిలో కొనసాగుతున్నా ప్రతి ఒక్కరం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయాలను మరువక కొనసాగించాలి.డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జీవితం భవిష్యత్తు తరాలకు స్ఫూర్తిదాయకం. జాతి నిర్మాణం కోసం వారు చేసిన త్యాగాలు ఆదర్శనీయం.డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ని స్ఫూర్తిగా తీసుకుని, నాడు అన్న ఎన్.టి.ఆర్. టీడీపీ ని స్థాపించారు. బడుగు, బలహీన వర్గాలకు అండగా నిలిచారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *