ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్
విశాఖ దక్షిణం, (స్వతంత్ర ప్రభ)
అణగారిన వర్గాల హక్కుల కోసం, సామాజిక సమానత్వం కోసం పోరాడిన గొప్ప స్ఫూర్తిదాత అనివిశాఖ దక్షిణ నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ పేర్కొన్నారు.మంగళవారం నియోజకవర్గంలో నిర్వహించిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలలో ఆయన పాల్గొని మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్భారత రాజ్యాంగ నిర్మాతగా, సంఘ సంస్కర్తగా, ఆర్థికవేత్తగా, అంటరానితనం,కుల నిర్మూలనకు కృషి చేసిన మహనీయుడు అని కొనియాడారు. ఆయన జీవితం, జ్ఞానం , సమసమాజ స్థాపన కోసం ఆయన చేసిన పోరాటం నేటి తరాలకు స్ఫూర్తిగా నిలిచిందన్నారు. కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడి, దళితులు, వెనుకబడిన వర్గాల హక్కుల కోసం కృషి చేశారని అన్నారు.విద్యే ఆయుధమని నమ్మి, అణగారిన వర్గాల విద్యాభివృద్ధికి, మహిళా సాధికారతకు కృషి చేశారని తెలిపారు.ఈ కార్యక్రమంలోవైసిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.