అంబేడ్కర్ రచించిన భారత రాజ్యాంగం ప్రపంచానికే ఆదర్శం

ఏపీ నిట్ రిజిస్ట్రార్ డాక్టర్ దినేష్ శంకర్ రెడ్డి

తాడేపల్లిగూడెం, (స్వతంత్ర ప్రభ)

భారతరత్న, డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ రచించిన భారత రాజ్యాంగం ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తుందని ఏపీ నిట్ రిజిస్ట్రార్ డాక్టర్ పి.దినేష్ శంకర్ రెడ్డి తెలిపారు.డీన్ స్టూడెంట్స్ వెల్ఫేర్ డాక్టర్ హిమబిందు ఆధ్వర్యంలో ప్రాంగణంలోని డాక్టర్ బి ఆర్ అంబేడ్కర్ సెంటర్ లైబ్రరీలో రాజ్యాంగ నిర్మాత, బి.ఆర్ అంబేడ్కర్ జయంతి వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు.ఈ సంధర్బంగా డాక్టర్ దినేష్ శంకర్ రెడ్డి మాట్లాడుతూ దేశం గర్వించదగిన మహోన్నతుడు అంబేడ్కర్ అని కొనియాడారు. భారత రాజ్యాంగ రూపశిల్పిగా,  ప్రపంచ మేధావిగా గుర్తింపు పొందిన అంబేడ్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరించినపుడే ఆయనకు మనమిచ్చే ఘన నివాళని తెలిపారు. రాజ్యాంగ నిర్మాతగానే కాకుండా సమాజంలో అణగారినవర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన పోరాటం చిరస్మరణీయమని ప్రశంసించారు. జీవితంలో ఎన్ని అవరోధాలు ఎదురైన విజయం సాదించవచ్చనడానికి అంబేడ్కర్ జీవితం ఒక ఉదాహరణ అని, విద్యార్థులు ఆయన్ని ఆదర్శంగా తీసుకుని వారి అడుగుజాడల్లో నడుచుకోవాలని వివరించారు.అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని గ్రంధాలయ చైర్మన్, ఆచార్యులు డాక్టర్ కార్తికేయ శర్మ ఆధ్వర్యంలో నిర్వహించిన వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు, ప్రసంసాపత్రాలను అందజేశారు. ముందుగా అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో డీన్లు డాక్టర్ వి.సందీప్, డాక్టర్ జీబి వీరేశ్ కుమార్,ఆచార్యులు డాక్టర్  భరణీ దరన్, డాక్టర్ నగేష్ భట్టు, డాక్టర్ వినోధ్ కుమార్ రాజా, డాక్టర్ కిరణ్ కుమార్, డాక్టర్ శీనివాసన్, డాక్టర్ రాముడు, డాక్టర్ చేబ్రోలు శ్రీలత, డాక్టర్ తలారి రేష్మా, తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *