నెల్లూరు డిసిసి అధ్యక్షులు నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి
నెల్లూరు, ఏప్రిల్:15( స్వతంత్ర ప్రభ)
నెల్లూరు లోని ఇందిరాభవన్ లో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి నెల్లూరు జిల్లా డిసిసి అధ్యక్షులు నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఇటీవల కేంద్ర ప్రభుత్వం దేశం లో డీ లిమిటేషన్, మహిళా రిజర్వేషన్ల బిల్లు కు సంబంధించి ఈ నెల 16,17,18 న పార్లమెంట్ లో ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి అని డీ లిమిటేషన్ కు సంబంధించి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కు ఓ లేఖ రాశారని ఈ లేఖ సారాంశం ప్రధానంగా డీ లిమిటేషన్ అనేది జనాభా ప్రాతిపదికన సీట్లు పెంపు జరుగుతుందని దీని వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరిగే అవకాశం ఉందని ఎందువల్ల అంటే చాలా కాలంగా దక్షిణాది రాష్ట్రాల్లో కుటుంబ నియంత్రణ పాటిస్తూ జనాభా గణనీయంగా తగ్గిఉంది,ఉత్తరాది రాష్ట్రాల్లో జనాభా అధికంగా ఉన్నందున ఆ రాష్ట్రాల్లో నియోజక వర్గాలు పెరిగి ఉత్తరాది రాష్టాల్లో సీట్లు పెరుగుతాయని, దక్షిణాది రాష్ట్రాల్లో సీట్లు తగ్గుతాయని ఈ వ్యత్యాసం వలన రాజకీయ పార్టీల ఉనికికే ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని, దక్షిణాది రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడు,ఆంధ్రప్రదేశ్,తెలంగాణ,కేరళ లో బీజేపీ పార్టీ ఉనికి తక్కువ కాబట్టి ఉత్తరాది రాష్ట్రాల్లో ఎంపీ సీట్లు గణనీయంగా పెంచుకోవడం వలన ప్రధానమంత్రి ఎంపిక లో దక్షిణాది రాష్ట్రాల పాత్ర ఉండకూడదనే ఉద్దేశ్యంతోనే డీ లిమిటేషన్ ప్రారంభించారని,ఇందిరా గాంధీ దేశ ప్రధానిగా ఉన్న కాలం లో 25 ఏళ్లు పాటు పార్లమెంటు స్థానాలు పెంచలేదని,దక్షిణాది కు అన్యాయం జరుగుతుందనే ఉద్దేశ్యం తోనే జనాభా తక్కువ ఉన్నారనే కారణం తోనే అప్పటి ప్రధాని అటల్బిహారీ వాజ్ పేయి కూడా డీ లిమిటేషన్ ఆపేశారని కిరణ్ కుమార్ రెడ్డి గుర్తుచేశారు.ఇదే సమయంలో మహిళా రిజర్వేషన్ బిల్లు పై కూడా కిరణ్ కుమార్ రెడ్డి కేంద్ర ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు..కాంగ్రెస్ ప్రభుత్వం 2010 వ సంవత్సరం లోనే పార్లమెంటు లో మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం తెలిపి రాజ్యసభ కు పంపగా అక్కడ బీజేపీ మద్దతు తెలపక పోవడం తోనే ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు ఆగిపోయిందని,ఈ రోజు ప్రధాని మోదీ అత్యవసరంగా పార్లమెంటు లో సమావేశం ఏర్పాటు చేసి మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశ పెడతాం అని చెబుతూ ఈ బిల్లు అమలు మాత్రం 2029 లో చేస్తాం అని చెబుతున్నారు అంటే రాజకీయ లబ్ది కోసమే అని ఇప్పుడు బెంగాల్,కేరళ, తమిళనాడు తో పాటు కొన్ని రాష్ట్రాల్లో అసంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయని వాటి లో లబ్ది పొందేందుకు మాత్రమే అని ఈ రాజకీయ కుట్రలు పై దేశ ప్రజలు ఆలోచించుకోవాలని ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలు చెల్లించే పన్నుల్లో కూడా కేంద్రం వ్యత్యాసం చూపుతుందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రానికి ఒక రూపాయి పన్ను కడితే తిరిగి ఏపీ కి 60 పైసలు మాత్రమే వెనక్కు ఇస్తున్న కేంద్రం బీహార్ రాష్ట్రానికి మాత్రం ఒక రూపాయి పన్ను కడితే 6 రూపాయలు తిరిగి ఇస్తూ ఉందని డీ లిమిటేషన్ మూలంగా దక్షిణాది రాష్ట్రాలు ప్రజలు తీవ్రంగా నష్టపోతారని కిరణ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.