పేదల ఆకలి తీర్చేందుకు ‘అన్న క్యాంటీన్’ 

రూ.5 లకే పోషకాహార భోజనం.

గిరి ప్రాంత ప్రజలకు అన్నపూర్ణ సేవలు.

రూ.61 లక్షలతో నిర్మించిన అన్నా క్యాంటీన్ నూతన భవనాన్ని ప్రారంభించిన మంత్రి గుమ్మడి సంధ్యారాణి.

పాడేరు, (స్వతంత్ర ప్రభ)

గిరిజన ప్రాంత ప్రజల, పేదల ఆకలి తీర్చడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అన్న క్యాంటీన్ సేవలు పాడేరు గిరి శిఖర ప్రాంతంలో అందుబాటులోకి వచ్చాయని, పురపాలక మరియు పట్టణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో పాడేరు పాత బస్టాండ్ రైతు బజార్ ప్రాంగణంలో  రూ. 61 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన అన్న క్యాంటీన్ భవనాన్ని రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మాత్యులు మరియు అల్లూరి జిల్లా ఇంచార్జ్ మంత్రితో పాటు జిల్లా కలెక్టర్ నిషాంతి. టి, జిల్లా జాయింట్ కలెక్టర్, ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి, జీసీసీ చైర్మన్ తో కలిసి  మంత్రి బుధవారం ఉదయం అన్న క్యాంటీన్ ప్రారంభించారు. ఈ క్యాంటీన్ ద్వారా పేద ప్రజలకు అత్యల్ప ధరకే భోజనం, కేవలం రూ.5/- లకే నాణ్యమైన, రుచికరమైన మరియు పరిశుభ్రమైన భోజనాన్ని ప్రభుత్వం ఈ క్యాంటీన్ ద్వారా అందిస్తోందని,అన్నపూర్ణ సేవలు కూలీలు, నిరుపేదలు, మరియు దూర ప్రాంతాల నుండి వచ్చే గిరిజనులకు ఈ పథకం ఒక వరమని మంత్రి పేర్కొన్నారు.ప్రభుత్వ లక్ష్యంగా పేదవాడి ఆకలిని గుర్తించి, పౌష్టికాహారాన్ని తక్కువ ధరకే అందించడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశ్యమని పేర్కొన్నారు.కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ.. “గతంలో మాదిరిగానే మళ్ళీ పేద ప్రజల ముంగిటకు అన్నపూర్ణ సేవలను తీసుకువచ్చాం. ముఖ్యంగా పాడేరు వంటి ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న పేదలకు ఈ రూ.5 భోజనం ఎంతో ఊరటనిస్తుందని, పారదర్శకతతో, నాణ్యతతో ఈ సేవలు నిరంతరం కొనసాగుతాయని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమం ప్రభుత్వ అనుమతులతో విశాఖపట్నం హరే కృష్ణ ఫౌండేషన్ వారు వి ఎస్ కె శర్మ జోనల్ కో ఆర్డినేటర్ పర్యవేక్షణలో  ప్రజలకు అందుబాటులో ఈ భోజన సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ప్రతిరోజు 350 మంది పేదవారికి ఈ కార్యక్రమం ద్వారా భోజనం అందుతుందని తెలిపారు.ప్రారంభోత్సవం ఆనంతరం మంత్రి,జిల్లా కలెక్టర్,జాయింట్ కలెక్టర్ చేతుల మీదుగా పేదవారికి భోజనం వడ్డించి అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నిషాంతి.టి, జిల్లా జాయింట్ కలెక్టర్ తిరుమాని శ్రీ పూజ, ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి ఆదిత్య వర్మ, జిసిసి చైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్,మాజీ శాసన సభ్యురాలు గిడ్డి ఈశ్వరి,జిసిసి డైరెక్టర్ ,బోర్ర నాగరాజు  పాడేరు మండల ఎస్టీ సెల్ అధ్యక్షుడు గండేరు పారిజాతం.. ప్రజాప్రతినిధులు, అధికారులు మరియు గిరిజన సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *