మహిళల భద్రతే మా ప్రాధాన్యత

అల్లూరి జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్.

పాడేరు,(స్వతంత్ర ప్రభ)

జిల్లాలో మహిళల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యంగా అల్లూరి జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ ఆధ్వర్యంలో పాడేరులో గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శులతో (జీ ఏం ఎస్ కె) ప్రత్యేక సమీక్షా సమావేశం మరియు అవగాహన ర్యాలీ నిర్వహించబడింది.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, గ్రామ స్థాయిలో మహిళలు ఎదుర్కొంటున్న వేధింపులు, గృహ హింస వంటి సమస్యలపై వెంటనే స్పందించి బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు. ముఖ్యంగా బాల్య వివాహాల నివారణ, చిన్నారులకు గుడ్ టచ్ – బ్యాడ్ టచ్’పై అవగాహన కల్పించడం మరియు నాటుసారా వంటి సామాజిక రుగ్మతలకు ప్రజలను దూరం చేయడంలో జీ ఏం ఎస్ కె లు కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. అలాగే,పెరుగుతున్న సైబర్ నేరాలు రోడ్డు ప్రమాదాల దృష్ట్యా ఆన్‌లైన్ మోసాల పట్ల మరియు హెల్మెట్ ధారణపై ప్రజలను చైతన్యం చేయాలని సూచించారు. “మహిళా కార్యదర్శులు పోలీసులకు, ప్రజలకు మధ్య వారధిలా పనిచేసి నేర రహిత సమాజానికి సహకరించాలి” అని ఆయన పేర్కొన్నారు.అనంతరం హుకుంపేట సీఐ సన్యాసినాయుడు ఆధ్వర్యంలో జిల్లాలోని అన్ని మండలాల మహిళా కార్యదర్శులతో భారీ **అవగాహన ర్యాలీ** నిర్వహించారు. మహిళలపై అఘాయిత్యాలను అరికట్టడమే ఈ ర్యాలీ ముఖ్య ఉద్దేశమని సీఐ తెలిపారు. ఏదైనా అసాంఘిక కార్యకలాపాలు గమనిస్తే వెంటనే స్థానిక పోలీసులకు లేదా డయల్ 112 కు సమాచారం అందించాలని జిల్లా ప్రజలకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *