నెల్లూరు,( స్వతంత్ర ప్రభ)
అనంతసాగరం బస్టాండు సెంటర్ నందు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల సోషల్ మీడియా విభాగం అధ్యక్షుడు బట్రెడ్డి నాగేంద్ర రెడ్డి మరియు వారి మిత్రులు ఏర్పాటు చేసిన మజ్జిగ చలివేంద్రం ప్రారంభించిన ఎంపిపి పెయ్యాల సంపూర్ణమ్మ,వైసీపీ మండల కన్వీనర్ బిజివేముల పిచ్చిరెడ్డి మరియు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు.మండల కేంద్రమైన అయిన అనంతసాగరం నుండి పల్లెలకు ప్రయాణం చేసే ప్రయాణీకుల వేసవి దాహం తీర్చేందుకు ఈ చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది అని నాగేంద్ర రెడ్డి తెలిపారు.కార్యక్రమంలో స్టేట్ టీచర్ ఉపాధ్యక్షులు మెట్టుకూరు సుబారెడ్డి, మండల రైతు సంఘ అధ్యక్షులు ఎద్దుల శ్రీనివాసులు రెడ్డి అల్లంపాటి సుధాకర్ రెడ్డి కేతా రవీంద్ర రెడ్డి పలువురు వైసీపీ నాయకులు హాజరయ్యారు.