ఆదివాసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చిన హుస్సేన్ నాయక్
న్యూస్ డెస్క్ (స్వతంత్ర ప్రభ)
అఖిల భారత గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం విశాఖ పట్నం జిల్లా కార్యవర్గం శనివారం జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ గౌ. సభ్యులు జాటోత్ హుస్సేన్ నాయక్ గారిని హైదరాబాద్ వారి కార్యాలయంలో గౌరవ పూర్వకంగా సమావేశమై విశాఖ పట్నం జిల్లా వివిధ కంపెనీల/ విభాగాల(హెచ్.ఎస్.ఎల్, అర్.ఐ.ఎన్.ఎల్, జీ.వి.ఏం.సి మొదలగు..) ఆదివాసీ ఉద్యోగుల న్యాయబద్ధమైన సమస్యలపై ఒక మెమొరాండం సమర్పించి వాటిని సత్వరమే పరిష్కారం చేయాలని అభ్యర్ధించడంమైనది అందుకు స్పందించిన కమిషన్ గౌ సభ్యులు మీ సమస్యలకు త్వరలోనే పరిష్కారం లభిస్తుందని హామీ ఇచ్చారు.ఈ సమావేశంలో సంఘం అధ్యక్షులు సొనాయి అప్పలరాజు,ప్రధాన కార్యదర్శి కటారి శోభన్ కుమార్, రాథోడ్,సమరెడ్డి బాల గంగాధర్ తిలక్, సీసా శోభన్, జంపరంగి రాము,కొండగోరి ప్రసాద రావు, ఓలేసు రవీంద్ర తదితరులు పాల్గొన్నారు.