మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో సమస్యలు త్వరితగత పరిష్కరించండి

చెరువు పూడికతీత పనులకు శంకుస్థాపన పాడేరు ఐటీడీఏ పిఓ ఆదిత్య వర్మ

పాడేరు, ఏప్రిల్ 18(స్వతంత్ర ప్రభ)

మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో సమస్యలను త్వరగా పరిష్కరించాలని పాడేరు ఐటీడీఏ పీవో ఆదిత్య వర్మ అధికారులను ఆదేశించారు.శనివారం ఉదయం మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి హాస్పటల్ లో సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బాలింతలు మరియు గర్భిణీ స్త్రీలతో ముచ్చటించి వారికి అందుతున్న సేవలపై ఆరా తీశారు. హాస్పటల్లో తనిఖీ చేయగా పలు విద్యుత్తు, ప్లంబింగ్, మరియు నీటి సమస్యలు ఉన్నాయని తెలుసుకోగా  నిర్వాహక అధికారులతో పిలిచి వెనువెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. నిర్వాహన సిబ్బందికి తగు సూచనలు సలహాలు అందించారు.గర్భిణీలకు మరియు శిశువులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని  అధికారులు ఆదేశించారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర లో భాగంగా పాడేరు మండలం సేరుబయల గ్రామం లో ప్రధాన చెరువునకు పాడేరు మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి తో  కలిసి జల హారతి ఇచ్చి పూడుకతీత పనులకు శంకుస్థాపన చేశారు.చెరువు చుట్టుపక్కల ప్రాంతంలో చెత్తాచెదారం వేరువేసి చెరువు పరిసరాలనుపరిశుభ్రంగా తయారు.చేశారు. అనంతరం గ్రామస్తులతో కలిసి గ్రామంలో మొక్కలు నాటి 100 రోజుల జలధార కార్యక్రమం పై అవగాహన కల్పించి గ్రామస్తులందరితో స్వర్ణాంత స్వచ్ఛందర ప్రతిజ్ఞ చేయిపించారు.ఈ కార్యక్రమంలో వైద్యులు హాస్పిటల్ సిబ్బంది మాత శిశు హాస్పిటల్ లో పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *