ఉచిత కుట్టు శిక్షణ పొందిన మహిళలకు సర్టిఫికెట్లు అందజేసిన.. ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి

నెల్లూరు ,ఏప్రిల్ 18 (స్వతంత్ర ప్రభ )

నెల్లూరు 3వ డివిజన్ కిసాన్ నగర్ లో  అభిషేకం ఫౌండేషన్ వ్యవస్థాపక చైర్మన్ అభిషేక్ రెడ్డి ఆధ్వర్యంలో ఉచిత కుట్టు శిక్షణ పొందిన మహిళలకు సర్టిఫికెట్ల ప్రధానోత్సవ కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్సిపి నెల్లూరు సిటీ ఇన్చార్జి ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి హాజరై.. మహిళలకు కుట్టుమిషన్లు, సర్టిఫికెట్లను అందజేశారుఅనంతరం మెరిట్ స్కాలర్షిప్ ఎగ్జామ్ లో ప్రతిభ సాధించిన విద్యార్థులను..చంద్రశేఖర్ రెడ్డి  అభినందించి సర్టిఫికెట్లు అందజేశారు.అభిషేక్ రెడ్డి  అభిషేకం ఫౌండేషన్ ఏర్పాటు చేసి..పేదల కోసం మెండుగా సేవా కార్యక్రమాలు నిర్వహించడం  ఎంతో సంతోషకరమని  ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. కుట్టు శిక్షణ  కార్యక్రమం ఏర్పాటు చేసి.. 20 మంది మహిళలకు కుట్టు శిక్షణ అందించి ఉచితంగా కుట్టు మిషన్లు అందజేయడం వారి సేవాభావానికి నిదర్శనమన్నారు. సేవా కార్యక్రమాలు చేపట్టడం తనకేంతో ఇష్టమని.. సేవా కార్యక్రమాలు చేపట్టెందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. భవిష్యత్ లో అభిషేక్ రెడ్డి మరెన్నో సేవా కార్యక్రమాలు చేపట్టి పేద ప్రజలకు బాసటగా నిలవాలని చంద్రశేఖర్ రెడ్డి  ఆకాంక్షించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *