చంద్రబాబు విజన్ తోనే రాష్ట్ర అభివృద్ధి

ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్..

తాడేపల్లిగూడెం, (స్వతంత్ర ప్రభ)

చంద్రబాబు విజన్ తోనే  రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని శాసనసభ్యులు, రాష్ట్ర ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో సోమవారం చంద్రబాబు జన్మదిన వేడుకలను నిర్వహించారు. ఈ వేడుకలలో ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు సుదీర్ఘ రాజకీయ అనుభవంతో రాష్ట్రం దేశంలోనే ప్రథమ స్థానంలో నిలుస్తుందని అన్నారు. యువతకు ఉజ్వల భవిష్యత్తు కల్పించే విధంగా  అత్యాధునిక టెక్నాలజీకి కేంద్రంగా అమరావతిని తీర్చిదిద్దుతున్నారని అన్నారు. కోటమి ప్రభుత్వానికి వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేనివైసీపీ నేతలు  అసత్య ప్రచారం తో ప్రజలను తప్పుదో పట్టించడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ప్రధాని మోడీ సహకారం,చంద్రబాబు విజన్  పవన్ కళ్యాణ్ నిజాయితీ లతో రాష్ట్రం ప్రగతి పధంలో దూసుకుపోతుందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే పేర్కొన్నారు. చంద్రబాబు జన్మదిన వేడుకల్లో భాగంగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన  సేవా కార్యక్రమాల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. గౌతమి ఆసుపత్రిలో రక్తదానం, ప్రభుత్వ ఆసుపత్రిలో గుడ్లు పాలు పంపిణీ చేశారు, ఆర్టీసీ బస్టాండ్ సెంటర్లో ఆటో కార్మికులకు నూతన వస్త్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఈతకోట తాతాజీ,వర్తనపల్లి కాశి, పుల్ల బాబి, ఎంపీపీ, కట్టు బోయిన  వెంకటలక్ష్మి, చాపల రమేష్,వాడపల్లి సబ్మిషన్ కృష్ణ మోహన్,సుబ్బరాజు, పాలూరి వెంకటేశ్వరరావు, వెంగళరావు, ఒట్టికూటి అబ్బు, నర్సి సోమేశ్వరరావు, పసల కొండ,బుడ్డి, సాయిబాబా, మద్దిపాటి ధర్మేంద్ర, బేతిన గిరి, బడుగు పెద్ద, రామ లక్ష్మణ్, అయినం బాలకృష్ణ, కూటమి నాయకులు పాల్గొన్నారు

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *