ఎస్.డి.సి, ఎస్. సుబ్బలక్ష్మి..
అనకాపల్లి (కలెక్టరేట్ ) (స్వతంత్ర ప్రభ)
లింగాయత్ సంప్రదాయాన్ని రూపొందించడంలో బసవేశ్వరుడు కీలక పాత్ర పోసించారాని కె ఆర్ ఆర్ సి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎస్ వి ఎస్ సుబ్బలక్ష్మి పేర్కొన్నారు. సోమవారం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో 895వ బసవేశ్వరుని జయంతి సందర్భంగా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎస్ వి ఎస్ సుబ్బలక్ష్మి బసవేశ్వరుని చిత్ర పటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ మాట్లాడుతూ లింగ వివక్షతను వ్యతిరేకించిన అభ్యుదయ వాది మహాత్మ శ్రీ బసవేశ్వరునడని అన్నారు. హైందవ మతాన్ని సంస్కరించిన ప్రముఖులలో బసవేశ్వరుడు ఒక్కడు. ఇతనిని బసవన్న, బసవుడు. విశ్వ గురువుని పిలుస్తారు. అన్నమయ్య, వేమన, వీర బ్రహ్మం భావాలలో విప్లవాత్మక మార్పులు రావడానికి పరోక్షంగా బసవేశ్వరుని కారణమని తెలిపారు. పాల్కురికి సోమనాథుడు రచించిన బసవ పురాణం తెలుగు సాహిత్యంలో ప్రసిద్ధమయ్యింది, దేవుడికి ప్రజలకు మధ్య పూజారులు అవసరం లేదు భక్తి కన్నా సత్ప్రవర్తనే ముఖ్యం అని చాటి చెప్పారన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండే రీతిగా వచనాలు రాశాడని తెలిపారు.ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ పరిపాలన అధికారి, సమన్వయ సూపరింటెండెంట్ విజయ్ కుమార్, వాసు నాయుడు, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.