కంచిలి, (స్వతంత్ర ప్రభ)
శ్రీకాకుళం జిల్లాలోని సోంపేట రైల్వే స్టేషన్ లో ప్రయాణికులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో విశాఖపట్నం డివిజన్ డివిజనల్ రైల్వే మేనేజర్‌కు జాయింట్ పిటిషన్ సమర్పించారు।ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర మహిళా కన్వీనర్, సంఘసేవకురాలు డాక్టర్ సిపాన గుణవతి మాట్లాడుతూ, సోంపేట రైల్వే స్టేషన్‌పై కంచిలి, కవిటి, సోంపేట మండలాలకు చెందిన 120కు పైగా గ్రామాల ప్రజలు ఆధారపడుతున్నారని తెలిపారు। ప్రతిరోజూ వేలాది మంది ప్రయాణికులు ఈ స్టేషన్‌ను వినియోగిస్తున్నప్పటికీ తగిన మౌలిక సదుపాయాల లేమితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు।స్టేషన్‌లో ఒకటో నెంబర్ ప్లాట్‌ఫారాన్ని వినియోగంలోకి తేనందుకు అధికారులు చర్యలు తీసుకోకపోవడంతో ప్రయాణికులు రెండో నెంబర్ ప్లాట్‌ఫారానికి చేరేందుకు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్‌ను మాత్రమే ఉపయోగించాల్సి వస్తోందన్నారు। ఇది ముఖ్యంగా వృద్ధులు, దివ్యాంగులకు తీవ్ర ఇబ్బందిగా మారిందని తెలిపారు। భద్రతా సదుపాయాల లోపంతో ప్రయాణికులు పట్టాల మీదుగా ప్రమాదకరంగా వెళ్లే పరిస్థితి నెలకొన్నదని, ఇటీవల జరిగిన మరణ ఘటన దీనికి నిదర్శనమని పేర్కొన్నారు।తాజాగా.. స్టేషన్‌లో శుభ్రమైన మరుగుదొడ్లు, సరైన వెయిటింగ్ హాల్, తాగునీటి సదుపాయాలు లేకపోవడం వల్ల ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారని తెలిపారు। పూరి–అహ్మదాబాద్, యశ్వంత్‌పూర్ వంటి ముఖ్య ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఇక్కడ గతంలో హాల్టింగ్ ఇచ్చి కూడా రద్దు చేశారని ప్రస్తుతం ప్రయాణికుల పెరుగుతున్న ప్రతి దృష్ట్యా ఈ రైలును సోంపేట రైల్వే స్టేషన్ హాల్టింగ్ ఇవ్వాల్సిన అవసరం ఎంత ఉందని డాక్టర్ గుణవతి గుర్తు చేశారు.ఆగక ఈ రైళ్లు సోంపేటలో నిలపకపోవడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు।..ఈ నేపథ్యంలో,ఒకటో నెంబర్ ప్లాట్‌ఫారాన్ని వెంటనే వినియోగంలోకి తేవడం ఫుట్ ఓవర్ బ్రిడ్జ్‌ను లిఫ్ట్, ర్యాంప్ సదుపాయాలతో ఆధునికీకరించడం ప్రాథమిక సదుపాయాలు కల్పించడం ప్రయాణికుల భద్రతను బలోపేతం చేయడం ముఖ్య ఎక్స్‌ప్రెస్ రైళ్లకు హాల్ట్ కల్పించడం అలాగే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును కూడా సోంపేటలో ఆపేలా చర్యలు తీసుకోవడంవంటి డిమాండ్లను పిటిషన్‌లో పొందుపరిచినట్లు తెలిపారు। సోంపేట స్టేషన్ మేనేజర్ తుఫాన్ కుమార్ బెహరా ద్వారా ఈ పిటిషన్‌ను డివిజనల్ రైల్వే మేనేజర్‌కు సోమవారం అందజేశార.ఈ సందర్భంగా స్టేషన్ మేనేజర్ మాట్లాడుతూఒకటో నెంబర్ ప్లాట్‌ఫారంలో రైళ్లు నడపడానికి ఇప్పటివరకు పై అధికారుల నుంచి ఎలాంటి ఆదేశాలు అందలేదని, అందువల్ల ప్రస్తుతం రెండో నెంబర్ ప్లాట్‌ఫారంనుంచే రైళ్లు నడుస్తున్నాయని తెలిపారు। అదనంగా, రైల్వే శాఖ నిర్లక్ష్యం వల్ల ప్రమాదాలు సంభవిస్తే సంబంధిత అధికారులపై భారతీయ న్యాయ సంహిత (BNS) 2023లోని సెక్షన్ 106, 125, అలాగే Railways Act 1989లోని సెక్షన్ 153, 154 మరియు రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 (జీవించే హక్కు) ప్రకారం చట్టపరమైన ప్రయాణికులు హక్కులను కాపాడే చర్యలు తీసుకోవాలని పిటిషన్‌లో డాక్టర్ గుణవతి స్పష్టం చేశారు. ప్రయాణికుల సమస్యలపై తక్షణ చర్యలు తీసుకోవాలని రైల్వే బోర్డు చైర్మన్, న్యూఢిల్లీతో పాటు విశాఖపట్నం డివిజన్ రైల్వే మేనేజర్ కీ కూడా ఈమెయిల్ ద్వారా ఫిర్యాదు పంపినట్లు సంఘం సభ్యులు తెలిపారు। చర్యలు తీసుకోకపోతే న్యాయపరమైన మార్గాలను అనుసరించాల్సి వస్తుందని హెచ్చరించారు।ఈ కార్యక్రమానికి జాతీయ బీసీ సంక్షేమ సంఘం శ్రీకాకుళం జిల్లా అడ్వైజర్ ఎల్. గోవిందరాజులు అధ్యక్షత వహించగా, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్.జి. ప్రసాద్, అడ్వైసర్ ఎల్. గోవిందరాజులు,పలాస సబ్‌డివిజనల్ సోషల్ మీడియా కన్వీనర్ పిట్టా పోలయ్య, సోంపేట–కంచిలి మండలాల కన్వీనర్లు కడియం ప్రసాద్, దనంజయ, సోంపేట మండల కార్యదర్శి ఈరోతు శ్రీనివాసరావు, కోస్టల్ వైస్ ప్రెసిడెంట్ బడే రాజేష్, కార్యదర్శులు డొంక సునీల్, పెట్టా రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు।