
పాడేరు, (స్వతంత్ర ప్రభ)
జిల్లాలోని 11 మండలాల్లో విధులు నిర్వహిస్తున్న 583 మంది విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్లకు (వి.ఏ.ఓ) జిల్లా కలెక్టర్ నిషాంతి. టి అత్యాధునిక శాంసంగ్ 5జీ మొబైల్ ఫోన్లను పంపిణీ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ సేవలను వేగవంతం చేస్తూ, స్వయం సహాయక సంఘాల పర్యవేక్షణను సులభతరం చేసేందుకు ప్రభుత్వం ఒక్కో ఫోన్‌ను రూ. 18,499 వెచ్చించి అందజేసింది.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలోని 13,316 సంఘాల్లో ఉన్న 1,52,554 మంది మహిళా సభ్యుల వివరాలను, రుణ చెల్లింపులను ఇకపై విఓఏలు వేగంగా, పారదర్శకంగా రిపోర్టింగ్ చేయవచ్చని తెలిపారు. ఎమ్మెల్సీ **కావాలి గ్రీష్మ ప్రసాద్**, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి పుట్టినరోజు సందర్భంగా ఈ ఫోన్ల పంపిణీ చేపట్టడం సంతోషకరమని, ఇది నారీ శక్తిని మరింత బలోపేతం చేస్తుందని పేర్కొన్నారు. ఈ మొబైల్స్ ద్వారా రియల్ టైం డేటా ఎంట్రీ మరియు ఆర్.టి.జి.ఎస్ అప్‌లోడ్ ప్రక్రియ సులభతరం అవుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌డీఏ పీడీ మురళి, జి సి సి డైరెక్టర్ బొర్ర నాగరాజు, డిపిఎం, భగవాన్ దాస్ , ఫైనాన్సు ఏపీఎం సత్య ప్రసాద్, సంబంధిత శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు, మండల సమాఖ్య ప్రతినిధులు వి.ఏ.ఓ లు పాల్గొన్నారు.