మెగా వైద్య, రక్తదాన శిబిరం ఏర్పాటు

తాడేపల్లిగూడెం, ( స్వతంత్ర ప్రభ)
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినాన్ని పురస్కరించుకుని నియోజకవర్గంలో నిర్వహించి న ఉచిత మెగా వైద్య, రక్తదాన శిబిరాన్నీ రాజ్యసభ సభ్యులు పాక సత్యనారాయణ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న ముఖ్యమంత్రి ఆశయాలకు అనుగుణంగా ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఆంధ్రప్రదేశ్ భవన, ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్, టీడీపీ ఇంచార్జ్ శ్రీ వలవల మల్లికార్జునరావు (బాబ్జి) ఆధ్వర్యంలో, ఏలూరు ఆశ్రం హాస్పిటల్స్ సహకారంతో జరిగిన ఈ శిబిరంలో 352 మంది స్వచ్ఛందంగా రక్తదానం చేయగా, 614 మంది రోగులకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. అంతకుముందు స్థానిక ఆలయాల్లో పూజలు నిర్వహించి, ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి, అన్న క్యాంటీన్ వద్ద కేక్ కటింగ్ వస్త్రదాన కార్యక్రమాలు చేపట్టారు. వింగ్స్ ఆఫ్ ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్, సేవా నారి ఉమెన్స్ వింగ్, ఎన్.ఎస్.ఎస్ బృందాల సహకారంతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో సుమారు 2000 మందికి విందు ఏర్పాటు చేశారు. వైద్య సేవలు అందించిన డాక్టర్లను సన్మానించి, దాతలకు ప్రశంసా పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.