ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్
తాడేపల్లిగూడెం (స్వతంత్ర ప్రభ)
హిందూ ధర్మ పరిరక్షణ భారతదేశానికి శ్రీరామరక్ష అని శాసన సభ్యులు, ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. స్థానిక హౌసింగ్ బోర్డ్, ఎన్ఎస్ రాజు టౌన్ షిప్ లో శ్రీ గాయత్రి అర్చక సంక్షేమ సంఘం భవనం, స్మార్త పాఠశాలను సోమవారం ఆయన ప్రారంభిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వందల సంవత్స రాల పాటు విదేశీయుల దాడు లతో హిందూధర్మానికి హాని జరిగిందని, స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఈ పరిస్థితి కొనసాగటం శోచనీయమని ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని మతాలను గౌరవించాలని, స్వధర్మాన్ని కాపాడుకోవాలని ఆయన పేర్కొన్నారు. మతం మారితే ఏదో కలిసి వస్తుందనే భ్రమలు వద్దన్నారు. ఏ మతమై నా మనం చేసే మంచి పనుల వల్లే ఉన్నత స్థితి వస్తుందని గ్రహించాలన్నారు. కర్మ సిద్ధాంతాన్ని ప్రతి ఒక్కరు విశ్వసించాలని చెప్పారు. హిందూ ధర్మ పరిరక్షణలో బ్రాహ్మణులకు ప్రముఖ స్థానం ఉందని ప్రశంసించారు. హిందూ ధర్మంపై దాడి చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. కార్యక్ర మంలో బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ బుజ్జి రాంప్రసాద్, అర్చక సంక్షేమ సంఘం అధ్యక్షుడు సతీష్ గాయత్రి పురోహిత సంఘం అధ్యక్షుడు ప్రయాగ కిషోర్, గౌరవ అధ్యక్షులు మర్ల విశ్వనాథ్ శర్మ, దసిక శ్రీనివాస్, బిజెపి నియోజకవర్గ కన్వీనర్ ఈతకోట తాతాజీ, బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ సబ్మివీసు కృష్ణమోహన్, బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు తటవర్తి నరసింహ మూర్తి కూటమి నాయకులు పాల్గొన్నారు.