న్యూస్ డెస్క్ (స్వతంత్ర ప్రభ)
ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి 76వ పుట్టిన రోజు సందర్భంగా ములుగు జిల్లా కేంద్రం లో తెలుగు తమ్ముళ్ల కేక్ కట్ చేసి ఘనంగా సంబరాలు నిర్వహించారు ఈ సందర్భంగా దేవా నాయక్ మాట్లాడుతూ క్రమ శిక్షణ గల పార్టీ టీడీపీ అని చంద్రబాబునాయుడు గారి పాలన లో ఆంధ్రప్రదేశ్ ఆన్ని రకాలుగా అభివృద్ధి సాధించింది అని ఇళ్లు లేని నిరుపేదలకు తెల్ల రేషన్ కార్డు ఉంటే ప్రతి ఒక్కరికీ ఇళ్లు నిర్మించి ఇచ్చిన ఘనత తెలుగు దేశం పార్టీ ది అని దేవా నాయక్ కొనియాడారు రాజకీయంగా ఎంతోమందిని అభివృద్ధి చేసిన పార్టీ కూడా టీడీపీ అని దేవా నాయక్ గుర్తుచేశారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారి కాలం లో ఎదిగిన నాయకులు ఇప్పుడు ఆపార్టీకి వెన్నుపోటు పొడుస్తున్నారని దేవా నాయక్ విమర్శించారు