కృషి, పట్టుదలతో ఏదైనా సాధించవచ్చు

ప్రిన్సిపాల్ చలపతి రావు..

అల్లూరి జిల్లా, (స్వతంత్ర ప్రభ)

స్థానిక ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో “డిపార్ట్మెంట్ ఆఫ్ మ్యాథమెటిక్స్” ఆధ్వర్యంలో ముఖ్యఅతిథిగా విచ్చేసిన కళాశాల ప్రిన్సిపల్ పట్టాసి చలపతి రావు, ” శకుంతలా దేవి చిత్రపటానికి పూలమాలతో సత్కరించి జ్యోతి వెలిగించి ఆమె వర్ధంతి” ని నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో భాగంగా కళాశాల ప్రిన్సిపల్  పట్టాసి.చలపతి రావు మాట్లాడుతూ శకుంతలా దేవి 1929 నవంబర్ 4న భారతదేశంలోని బెంగళూరులో జన్మించారని 2013 ఏప్రిల్ 21వ తేదీన మరణించడం జరిగిందని విద్యార్థులకు తెలియజేస్తూ, చిన్న వయసులోనే ఆమె అసాధారణమైన గణిత ప్రతిభను కనిపించిందని కేవలం మూడు సంవత్సరాల వయసులోనే సంఖ్యలతో అద్భుతంగా ఆడుకోవడం ప్రారంభించారని, ఆమె ప్రతిభను ప్రపంచం గుర్తించి 1982లో గిన్నిస్ వర్డ్ రికార్డ్స్ లో ఆమె పేరు నమోదయిందని మరియు మరెన్నో విషయాలు విద్యార్థులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గణిత అధ్యాపకులు  కోడా.ప్రసాదరావు  మాట్లాడుతూ శకుంతలా దేవి ఎలాంటి కాలిక్యులేటర్ లేకుండా చాలా పెద్ద సంఖ్యల లెక్కలను తక్షణమే చెప్పగలిగేది అని, రెండు 13 అంకెల సంఖ్యలను కేవలం 28 సెకన్లలో గుణించడం ద్వారా రికార్డు సాధించారని. అందుకే ఆమెను “హ్యూమన్ కంప్యూటర్” అని పిలుస్తారని ఆమె జీవితం మనకు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుందని— కృషి, ఆసక్తి మరియు పట్టుదల ఉంటే ఎలాంటి లక్ష్యాన్నైనా సాధించవచ్చు అని విద్యార్థులకు తెలియజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో భాగంగా అధ్యాపకులు ఎన్.ఎస్.ఎస్.పి.ఓ  కె.బాలరాజు , డాక్టర్ కే.స్వర్ణలత , డాక్టర్ మురళీకృష్ణ , ఎస్.లాలీ, ఎం.రోజా రాణి , ఎస్.అన్నపూర్ణ , డీ.కే.వి.ఎస్.ప్రణీత , పీ.శోభన్ , ఎన్.శ్రావణి , పిడి ఎల్.జ్యోతి మరియు విద్యార్థులు పాల్గొనడం జరిగింది.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *