కాపులుగా ఎంపికైన మత్స్యకార పెద్దలకు అభినందనలు..!

ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి..

నెల్లూరు, (స్వతంత్ర ప్రభ)

విడవలూరు మండల పరిధిలోని ఊటుకూరు పెద్దపాళెం మత్స్యకార గ్రామ పెద్దలలు తమ నూతన నాయకత్వాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గ్రామ మత్స్యకార సంఘం పెద్ద కాపుగా ఆడంగారి కనకయ్య, నడిం కాపుగా కొండూరు ఏడుకొండలు, చిన్న కాపుగా కొండూరు అమరేంద్ర, మరియు క్యాషియర్‌గా పాపారావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరితో పాటు మరో ఆరుగురు మత్స్యకార ప్రముఖులను గ్రామ పెద్ద మనుషులుగా సంఘం సభ్యులు ఎంపిక చేశారు.ఈ నేపథ్యంలో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన మత్స్యకార నాయకులు నెల్లూరు నగరం మాగుంట లేఅవుట్‌లోని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డినిక్యాంప్ కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డికాపులు మరియు మత్స్యకార పెద్దలకు అభినందనలు తెలిపారు. ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీ నాయకులు బెజవాడ వంశీకృష్ణారెడ్డి మత్స్యకార పెద్దలకు పూల మాలలు,  శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి నూతన కార్యవర్గం మత్స్యకారుల సమస్యల పరిష్కారానికి వారి ఆర్థికాభివృద్ధికి  అంకిత భావంతో కృషి చేయాలని సూచించారు. మత్స్యకారులకు ప్రభుత్వం నుండి అందాల్సిన సంక్షేమ పథకాలు సకాలంలో అందేలా కృషి చేస్తాననని మత్స్యకార నాయకులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాపులతో పాటు పలువురు మత్స్యకార నాయకులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *