హనుమకొండ జిల్లా (స్వతంత్ర ప్రభ)
శ్రీ వేంకటేశ్వర బధిరుల ఉన్నత పాఠశాల వరంగల్ కు తిరుమల తిరుపతి దేవస్థానములు జే ఈ ఓ JEO (health and education), డాక్టర్ శరత్ పాఠశాల ను సందర్శించడం జరిగింది. జే ఈ ఓ మాట్లాడుతూ విద్యార్థులు అందరికీ హియరింగ్ ఎయిడ్స్ అతి త్వరలో ఇప్పిస్తాను, కొత్త బిల్డింగు కన్స్ట్రక్షన్ పూర్తయ్యేలా తగు చర్యలు తీసుకుంటాను, విద్యార్థులందరికీ విద్యాబోధనలో ఒకటి నుండి పదవ తరగతి వరకు డిజిటల్ బోర్డులు అందిస్తాను, పాఠశాల ఆవరణంలో చెట్ల పెంపకం ప్రతి టీచర్ ప్రతి విద్యార్థి భాగస్వామ్యం అయ్యేలా చెట్లు నాటాలని సూచనలు ఇవ్వడం జరిగింది మరియు ఆఫీస్ సిబ్బంది పి చరణ్ సింగ్ (జూనియర్ అసిస్టెంట్) ను జే ఈ ఓ సన్మానించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ప్రిన్సిపాల్ జె. లక్ష్మీ నర్సమ్మ, ఉపాధ్యాయ సిబ్బంది మరియు ఆఫీస్ సిబ్బంది పి.చరణ్ సింగ్, హాస్టల్ సిబ్బంది పాల్గొనడం జరిగింది.