నిరుద్యోగ భృతి అమలు చేయాలి

మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి

విశాఖ దక్షిణం (స్వతంత్ర ప్రభ)

పచ్చి అబద్దాల దగాకోరు చంద్రబాబు అని, యువతకిచ్చిన హామీలను కూడా విస్మరించిన కూటమి ప్రభుత్వంపై మాజీ ఎమ్మెల్యే దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ నిప్పులు చెరిగారు. సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా నిరుద్యోగ భృతి అమలు చేయాలని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద శనివారం వాసుపల్లి గణేష్ కుమార్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. క్రిస్టియన్ మైనార్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ బొల్లవరపు జాన్ వెస్లీ, నియోజకవర్గ పరిశీలకులు వీశం రామకృష్ణ, దక్షిణ వైసీపీ శ్రేణులు భారీగా హాజరై మానవహారం నిర్వహించి నినాదాలు చేస్తూ రోడ్లపై బైఠాయించారు. ఈ సందర్భంగా వాసుపల్లి మీడియాతో మాట్లాడుతూ . “ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇన్ని రోజులవుతున్నా నిరుద్యోగులకు భృతి చెల్లించకపోవడం అన్యాయమన్నారు.  నిరుద్యోగ యువతను వంచించకుండా తక్షణమే వారికి రావాల్సిన భృతిని విడుదల చేయాలనీ డిమాండ్ చేశారు .యువతకు ఉపాధి కల్పించడంలోనూ, ఆర్థికంగాఆదుకోవడంలోనూ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన విమర్శించారు.ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన అబద్ధాల హామీల్లో సూపర్ 6 సంగతి నాకు తెలియదు గానీ, సూపర్ 7 మాత్రం బాగా జరుగుతున్నాయని ఎద్దేవా చేశారు*వారి ఆత్మహత్యలతో మహాప్రస్థానం వాహనాలు మాత్రం బాగా పనిచేస్తున్నాయనీ ఆగ్రహం వ్యక్తం చేశారు.  *ఉద్యోగాలు లేక నిరుద్యోగ భృతి రాక యువత ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు.  ఒక్కొక్కరికి 3000 చొప్పున  నిరుద్యోగి భృతి  17 లక్షల మంది నిరుద్యోగులకు ఏడాదికి ₹2520/- కోట్లు ఇస్తామని అందలం ఎక్కి నేటికి రెండు సంవత్సరాలకు గాను రూ. ₹5040/- కోట్లు బకాయిలు యువతకి చెల్లించాలన్నారు. కానీ చంద్రబాబు యూ టర్న్ తీసుకుని ఏ ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంతాన్ని విదేశాలు మాదిరిగా రూపు రేఖలు మార్చేస్తాం అనడం హాస్యాస్పదమన్నారు. కరోనా క్లిష్ట పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి కేవలం రెండున్నర లక్షలు కోట్లు మాత్రమే అప్పు చేశారని, చంద్రబాబు  రెండేళ్లలోనే 3 లక్షల కోట్లు అప్పులు చేసి ఎవరికీ ఇచ్చారని వాసుపల్లి ప్రశ్నించారు.లేని పక్షంలో నిరుద్యోగుల తరపున తమ పోరాటం ఆగదని, ప్రభుత్వం దిగివచ్చే వరకు ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని వాసుపల్లి గణేష్ కుమార్  హెచ్చరించారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు, వార్డు అధ్యక్షులు రాష్ట్ర,జిల్లా, నియోజకవర్గ స్థాయి నాయకులు భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *