హెచ్.పి.వి.వాక్సిన్ తో ఆడపిల్లలను కాపాడుకుందాం

ఎమ్మెల్యే బొలిశెట్టి….

తాడేపల్లిగూడెం, (స్వతంత్ర ప్రభ)

కేన్సర్ బారిన పడకుండా హెచ్.పి.వి వ్యాక్సిన్ రక్షణగా నిలుస్తుందని, 14ఏళ్ళ లోపు వయసున్న ఆడపిల్లలందరికీ ఈ వ్యాక్సిన్ ఇచ్చి భవిష్యత్తు లో సర్వైకల్ క్యాన్సర్ రాకుండా కాపాడుకోవాలని శాసనసభ్యులు, రాష్ట్ర ప్రభుత్వ విప్  బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. స్థానిక రవి మాధవ్ ఆసుపత్రిలో లయన్స్ క్లబ్, స్పిరిట్ క్లబ్, ఫెమినా క్లబ్ ల ఆధ్వర్యంలో మంగళవారం  హెచ్.పి.వి. వ్యాక్సిన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సేవా కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సేవకు మారుపేరైన లయన్స్ క్లబ్ వారు సుమారు 160 మంది ఆడపిల్లలకు ఈ సేవాశిబిరం లో వ్యాక్సిన్ అందజేయడం అభినందనీయమని అన్నారు.సర్వైకల్ కాన్సర్ నివారణకు ప్రభుత్వం చేస్తున్న కృషికి సహకారం అందిస్తున్న లయన్స్ క్లబ్ కు ధన్యవాదాలు తెలిపారు. కలుషిత ఆహారం తినడం ద్వారా క్యాన్సర్ వస్తుందని, ఈ విషయంలో జాగ్రత్త వహించాలన్నారు. క్యాన్సర్ వైద్యం ఎంతో ఖరీదైందని, కుటుంబాలు ఆర్థికంగా దెబ్బతింటాయని అన్నారు. ప్రతి ఒక్కరు అవగాహనతోఉండాలని,క్యాన్సర్ మహమ్మారి బారిన పడకుండా ఆహారపు అలవాట్లలో జాగ్రత్త వహించాలన్నారు. ఈ కార్యక్రమం లో లయన్స్ జిల్లా గవర్నర్ పాపారావు నాయుడు, మణింద్ర, త్రిమూర్తులు, పెదప్రోలు భాస్కర్,వైద్యులు చిట్యాల సురేంద్ర, నార్ని భవాజీ, చిట్యాల పద్మిని చిట్యాల సురేంద్ర కుమార్, అడపా ప్రసాద్, పాలూరి వెంకటేశ్వరరావు, గోగు కిరణ్,సత్తి జగన్మోహన్, ఆకుల మోహన్ రాధిక, గారపాటి శ్యామల కుమారి, నున్న శ్రీ నాగలక్ష్మి,  సుంకర యేసు, అడ్డు రంజిత్, అప్పన వెంకట సత్య రమేష్ కుమార్, పెద్ద బోలు భాస్కర్, కూటమి నాయకులు పాల్గొన్నారు తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *