వాహనదారులకు హెల్మెట్ పై అవగాహన

తాడేపల్లిగూడెం,(స్వతంత్ర ప్రభ)

హెల్మెట్ అనే రక్షణ కవచం ధరించండి.తాడేపల్లిగూడెం సీఐ బోనం ఆది ప్రసాద్. హెల్మెట్ అనే రక్షణ కవచాన్ని ప్రతిఒక్కరూ ధరించాలని తాడేపల్లిగూడెం పోలీస్ స్టేషన్ సిఐ బోనం ఆది ప్రసాద్ అన్నారు.రహదారి భద్రత అనేది కేవలం మాట మాత్రమే కాదని, అది జీవితానికి భద్రత అని అన్నారు. పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు, ప్రయాణికులలో చైతన్యం నింపేందుకు పోలీస్ శాఖ విభాగం ఒక అడుగు ముందుకు వేసింది. బుధవారం స్థానిక తాడేపల్లిగూడెం టూ టౌన్ లో హెల్మెట్ దారణపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమనికి టౌన్ సిఐ ఆది ప్రసాద్ వాహనదారులకు దిశా నిర్దేశం చేశారు.మనం ధరించే హెల్మెట్ కేవలం ప్లాస్టిక్ ముక్క కాదు, అది మన ప్రాణాలను కాపాడే రక్షణ కవచమని, రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు తలకు తగిలే చిన్న గాయం కూడా ప్రాణాంతకం కావచ్చు అని ఆ ప్రమాదం నుండి మనల్ని రక్షించేది ఒక్క హెల్మెట్ మాత్రమేనాని అన్నారు.మీరు వాహనంపై బయటకు వెళ్ళినప్పుడు ఇంటి వద్ద మీ కోసం మీ భార్యాబిడ్డలు, తల్లిదండ్రులు ఎదురుచూస్తుంటారని మర్చిపోవదన్నారు. మీ ప్రాణం మీ ఒక్కరిదే కాదు, మీ కుటుంబానిది కూడా వారి భవిష్యత్తు కోసం అయినా మీరు నియమాలు పాటించాలన్నారు. అవగాహన కల్పించడం మా మొదటి ఉద్దేశమని, కానీ నిబంధనలు అతిక్రమించి, హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపితే మాత్రం కఠినమైన చట్టపరమైన చర్యలు తప్పవు అని చెప్పారు.జరిమానాలు విధించడం మా లక్ష్యం కాదు, మిమ్మల్ని సురక్షితంగా మీ ఇంటికి చేర్చడమే మా ప్రాధాన్యత అన్నారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సిబ్బంది వాహనదారులకు హెల్మెట్ ప్రాముఖ్యతను తెలియజేశారు. ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి, సురక్షిత ప్రయాణాన్ని సాగించాలని కోరారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *