సెన్సెస్ ఎన్యూమరేషన్ పనులను పరిశీలించిన జె.నివాస్, ఐఏఎస్

విశాఖ దక్షిణం,(స్వతంత్ర ప్రభ)

జె.నివాస్, ఐఏఎస్ వార్డ్ నెంబర్ 34 పరిధిలోని కొబ్బరి తోట, ఎస్‌వీపీ నగర్, సర్కిల్-41 ప్రాంతాలలో ప్రస్తుతం జరుగుతున్న సెన్సెస్ ఇళ్ల జాబితా ఎన్యూమరేషన్ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా స్థానిక ప్రజలను నేరుగా కలిసి, ఎన్యూమరేషన్ ప్రక్రియ ఎలా జరుగుతోందనే విషయంపై ఆరా తీశారు. ఇంటింటికి వచ్చే ఎన్యూమరేటర్లకు సరైన మరియు పూర్తి సమాచారం అందించి, సెన్సెస్ ఎన్యూమరేషన్ విజయవంతంగా పూర్తయ్యేందుకు సహకరించాలని ప్రజలను కోరారు.అలాగే, ఎన్యూమరేటర్లు నిర్వహిస్తున్న డిజిటల్ ఎన్యూమరేషన్ విధానం, ఇళ్ల మ్యాపింగ్ ప్రక్రియ, ఇప్పటివరకు నమోదు చేసిన వివరాలను ఎన్యూమరేటర్ల మొబైల్ ఫోన్లలో ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా అవసరమైన సూచనలు మరియు మార్గదర్శకాలు అందించారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్యూమరేషన్ పనులను సంతృప్తికరంగా నిర్వహిస్తున్నందుకు ఎన్యూమరేటర్లు మరియు సూపర్వైజర్లను అభినందించారు.ఈ పర్యటనలో రమణమూర్తి అదనపు కమిషనర్, జోనల్ కమిషనర్ మల్లయ్య నాయుడు, నాగార్జున డిప్యూటీ ప్రాజెక్ట్ ఆఫీసర్, సెన్సెస్ ప్రత్యేక బృందం సభ్యులు, ఎన్యూమరేటర్లు మరియు సూపర్వైజర్లు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *