పరిశీలించిన జాన్ వెస్లీ మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్
దక్షిణం (స్వతంత్ర ప్రభ )
దక్షిణ నియోజకవర్గం 35వ వార్డులో క్యాడర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియకు సంబంధించి ఓటిపి వెరిఫికేషన్ ను మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్సిపి సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్,సౌత్ పరిశీలకులు వీసo రామకృష్ణ పరిశీలించారు. సమక్షంలో సోమవారం 35 వార్డు కార్యాలయంలో ఆ వార్డు అధ్యక్షుడు అలుపున కనక రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న వెరిఫికేషన్ ప్రక్రియను అడిగి తెలుసుకున్నారు. త్వరగా పూర్తి చేయాలని ఆదేశిస్తూ పలు సూచనలు చేశారు. మన నియోజకవర్గంలో అన్ని వార్డులకన్నా ముందుండాలని వాసుపల్లి అన్నారు. రాష్ట్రస్థాయిలో దక్షిణ నియోజక వర్గం మొదటిస్థానంలో ఉండాలన్నారు. అధినేత జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు మేరకు క్యాడర్ ను బలోపేతం చేయాలన్నారు. ప్రతి ఒక్కరికి పార్టీ లో గుర్తింపు ఇవ్వడమే పార్టీ లక్ష్యమన్నారు. మంగళవారం లోగా పూర్తి చేసి అందజేయాలని కనకారెడ్డి కి ఆదేశించారు. రానున్న ఏ ఎన్నికలలోనైనా వైఎస్ఆర్సిపి విజయం సాధించే విధంగా అందరూ కలిసికట్టుగా పనిచేయాలనీ వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు. ప్రజల పక్షాన కూటమి పై పోరాటం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీ సెల్ చైర్మన్ బొల్లవరపు జాన్ వెస్లీ, , దక్షిణ నియోజకవర్గ వార్డు అధ్యక్షులు, వార్డ్ కార్పొరేటర్స్,అనుబంధ సంఘాల అధ్యక్షులు,వార్డ్ నాయకులు పాల్గొన్నారు.