
విశాఖ దక్షిణం, (స్వతంత్ర ప్రభ)
ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ సౌత్ జోన్ పరిధిలోని 32వ వార్డులో జోనల్ కమిషనర్ ఎం. మల్లయ్య నాయుడు ఆధ్వర్యంలో “స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర” కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛ సర్వేక్షణ్ అంశాలపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించారు. ముఖ్యంగా తడి చెత్త, పొడి చెత్త వేర్వేరుగా సేకరించడం, ఇంటింటా చెత్త వర్గీకరణ చేపట్టడం, బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయకుండా ఉండడం వంటి అంశాలను వివరించారు. మరియు బ్లూ, గ్రీన్, ఎరుపు , నలుపు డస్ట్బిన్ల వినియోగంపై ప్రత్యక్ష ప్రదర్శన నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించారు.అదేవిధంగా “Say No To Plastic” నినాదంతో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా తగ్గించాలని ప్రజలకు సూచించారు.పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని అధికారులు కోరారు. నగరాన్ని పరిశుభ్రంగా, హరితంగా మరియు ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దేందుకు ప్రజల సహకారం అత్యంత అవసరమని తెలిపారు.స్వచ్ఛ సర్వేక్షణ్ లో విశాఖ నగరానికి ఉత్తమ ర్యాంకు సాధించేందుకు ప్రజల భాగస్వామ్యం కీలకమని పేర్కొంటూ పరిశుభ్రతపై అవగాహన పోస్టర్లు ప్రదర్శించారు.ప్రజలకు పరిశుభ్రతపై ప్రతిజ్ఞ చేయించడంతో పాటు అవగాహన రాలిని కూడా ఏర్పాటు చేసి చెత్తను ఇంటికి వచ్చే పారిశుద్ధ కార్మికునికి అందించాలని మరియు బహిరంగ ప్రదేశాలలో వేయకూడదని సూచించారు.ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్ కృష్ణంరాజు గారు, అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ పద్మావతి , సానిటరీ సూపర్వైజర్ కామేశ్వర్ రెడ్డి, సానిటరీ ఇన్స్పెక్టర్ కీర్తి మరియు సచివాలయ సిబ్బంది మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.