విశాఖపట్నం (స్వతంత్ర ప్రభ)
ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ అర్చక మరియు పురోహిత సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో మధురవాడ స్వతంత్ర నగర్ శ్రీ షిరిడీ సాయి బాబా ఆలయంలో సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు వెలగలేటి సతీష్ మాట్లాడుతూ రాష్ట్రంలో మన అర్చకులు మరియు పురోహితులు కోసం నిరంతరం శ్రమించే ఏకైక సంఘం ఏపీపీ ఏపీ సంక్షేమ సంఘం అని చెప్పడం జరిగింది రాష్ట్ర కార్యదర్శి అధికారుల కాళిదాస్ మాట్లాడుతూ సంఘం మరింత బలోపేతం కు రాష్ట్ర కమిటీ సభ్యులును అనుసంధానం చేసుకుంటూ జిల్లా కమిటీ సభ్యులు వారి వారి బాధ్యతలు నీమ నిబంధనలుతో క్రమశిక్షణతో ముందుకు సాగిపోవాలని అయిన తెలిపారు రాష్ట్ర కమిటీ సభ్యులు నిష్ఠల రాంబాబు ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన విశాఖ జిల్లా అధ్యక్షులు అంబటిపూడి సుధీర్ శర్మ మరియు జిల్లా కమిటీ సభ్యులుకు నూతన మినిట్స్ బుక్ వంటి ముఖ్యమైనవి అందజేయడం జరిగింది ఈ సమావేశంలో జిల్లా అధికార ప్రతినిధి కార్తికేయ శ్రీనివాస్ శర్మ, జిల్లా గౌరవ సలహా దారులు హరిప్రసాద్ శర్మ మరియు జిల్లా కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.