రెండు చోరీ కేసులను ఛేదించిన పోలీసులు

పాత నేరస్థుడితో పాటు మరో కేసులో బంధువే
నిందితులుగా గుర్తింపు..!

..సిబ్బందిని అభినందించిన నగర సి.పి డా. శంఖబ్రత బాగ్చి, ఐ.పి.ఎస్.

విశాఖపట్నం క్రైమ్ (స్వతంత్ర ప్రభ)

విశాఖపట్నం నగర పోలీస్ కమిషనర్ డా. శంఖబ్రత బాగ్చి, ఐ.పి.ఎస్. ఆదేశాలతో నగరంలో నేరాల అదుపునకు, పాత కేసుల చేధించడానికి పోలీసులు ముమ్మర చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గతంలో జరిగిన రెండు వేర్వేరు చోరీ కేసులను పోలీసులు అత్యంత ప్రతిభావంతంగా ఛేదించి, నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
……వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పూర్ణామార్కెట్ ప్రాంతంలో పది నెలల క్రితం ఒక ఇంటిలో చోరీ జరిగింది. ఈ ఘటనపై అప్పట్లో క్రైమ్ కేసు క్రింద నమోదైన కేసు పై ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వన్‌టౌన్ క్రైమ్ సిబ్బంది నిరంతరం నిఘా ఉంచారు. ఈ క్రమంలోనే పాత నేరస్థుడు, సస్పెక్ట్ షీట్ హోల్డర్ అయిన నకరబోయిన రాజేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించి. నిందితుడి గా గుర్తించి..!?అతని వద్ద నుండి చోరీకి గురైన 35 గ్రాముల వెండి వస్తువులు, ఒక సెల్ ఫోన్‌ ను రికవరీ చేశారు. అనంతరం నిందితుడిని కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం రిమాండ్ విధించింది.
మరో కేసులో.. వన్‌టౌన్ పరిధిలో ఇటీవల జరిగిన ఒక చోరీపై నమోదైన కేసు పై పోలీసులు సాంకేతిక ఆధారాలతో లోతుగా దర్యాప్తు చేయగా ఫిర్యాదుదారుడి తమ్ముడి భార్య అయిన కనకమహాలక్ష్మి ఈ దొంగతనానికి పాల్పడినట్లు పోలీసులు ఆధారాలతో సహా నిర్ధారించారు…!? ఆమె వద్ద నుండి 3 తులాల బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితురాలిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపారు. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న కేసుతో పాటు, మరో క్లిష్టమైన కేసును చాకచక్యంగా ఛేదించిన క్రైమ్ ఎస్సై పి.డి.పి. శంకర్, మరియు క్రైమ్ సిబ్బందిని డీసీపీ ప్రత్యేకంగా అభినందించారు.
ప్రతిభ కనపరచిన సిబ్బందిని అభినందించిన నగర సి.పి డా. శంఖబ్రత బాగ్చి, ఐ.పి.ఎస్. నగరంలో శాంతిభద్రతల పరిరక్షణకు, బాధితులకు న్యాయం చేయడంలో పోలీసులు ఎల్లప్పుడూ ముందుంటారని ఈ సందర్భంగా ఉన్నతాధికారులు పేర్కొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *