ప్రసాద్ గార్డెన్స్ లోని సచివాలయాన్ని తనకి చేసిన జెడ్.సి  ఎం.మల్లయ్య నాయుడు

విశాఖ దక్షిణం, (స్వతంత్ర ప్రభ)

దక్షిణ జోన్ జోనల్ కమిషనర్ ఎం. మల్లయ్య నాయుడు 35వ వార్డులోని ప్రసాద్ గార్డెన్స్ సచివాలయం నం.1086209 ను ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది.ఈ తనిఖీలలో భాగంగా సచివాలయ సెక్రటరీలు ప్రజలకు అందిస్తున్న సేవలు, వారి విధుల నిర్వహణ, పనితీరు మరియు ప్రభుత్వ కార్యక్రమాల అమలుపై సమగ్రంగా ఆరా తీశారు. అదేవిధంగా సచివాలయంలో నిర్వహించాల్సిన రికార్డులను పరిశీలించి, వాటి నిర్వహణ విధానాన్ని సమీక్షించారు.అలాగే సచివాలయాలకు వచ్చే ప్రజలకు ఏ విధంగా సేవలు అందిస్తున్నారనే అంశాన్ని కూడా పరిశీలించారు. ప్రజలకు వేగవంతమైన, పారదర్శకమైన మరియు నాణ్యమైన సేవలు అందే విధంగా మరింత మెరుగైన చర్యలు తీసుకోవాలని సంబంధిత సిబ్బందికి తగిన సూచనలు ఇవ్వడం జరిగింది.ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వివిధ కార్యక్రమాలు మరియు సర్వేలు అయిన యు.ఎఫ్.ఎస్ సర్వే, మనమిత్ర సిటిజన్ వాట్సాప్ ట్రైనింగ్, సిటిజన్ ఈ  కెవైసి అలాగే వార్డులో జరుగుతున్న జనగణన సర్వే తదితర అంశాలపై క్షుణ్ణంగా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సంబంధిత సిబ్బందికి పనులను వేగవంతంగా పూర్తి చేయడంతో పాటు, ప్రభుత్వ లక్ష్యాలను సమర్థవంతంగా అమలు చేయాలని సూచనలు జారీ చేశారు.ఈ తనిఖీలలో సచివాలయ సెక్రటరీలు మరియు సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *