
విశాఖ దక్షిణం,మే:23 ( స్వతంత్ర ప్రభ)
దక్షిణ నియోజకవర్గం 32వ వార్డు లో శనివారం ఆపరేషన్ క్లీన్ అండ్ స్వీప్ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో భాగంగా నేరేళ్లు కోనేరు సి.పి.ఐ కార్యాలయం ప్రాంగణంలో పసుపు/ఎరుపు,రంగుల మచ్చలను శుభ్రపరచడం జరిగింది తదనంతరం వార్డులో తదితర ప్రాంతాల్లో చెత్త పూడికలు తొలగించి, రోడ్లను శుభ్రపరచి స్థానికులకు అవగాహన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో 32వార్డు మాజీ కార్పొరేటర్ కందుల నాగరాజు , వార్డు ఎస్సై కీర్తి, కార్యదర్శులు, పి హెచ్.మేస్త్రి, సూపర్వైజర్, పి.హెచ్ సిబ్బంది , నేరెళ్ళ కోనేరు స్థానికులు తదితరులు పాల్గొన్నారు.